ETV Bharat / bharat

'వారం రోజుల్లోగా నిందితులను అరెస్ట్ చేయండి' - రాకేశ్ టికాయిత్

లఖింపుర్ ఖేరి(Lakhimpur kheri news) ఘటన నిందితులను అరెస్ట్ చేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి వారం రోజుల గడువిస్తున్నామన్నారు రైతుసంఘం నేత రాకేశ్ టికాయిత్. ఈ మేరకు అల్టిమేటం జారీచేశారు. మృతుల కుటుంబాలకు సంయుక్త కిసాన్ మోర్చా సంఘం అండగా ఉంటుందన్నారు.

Tikait
రాకేశ్ టికాయిత్
author img

By

Published : Oct 6, 2021, 5:42 AM IST

లఖింపుర్ ఖేరి(Lakhimpur violence news) హింసాత్మక ఘటనపై రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయిత్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా(Ajay mishra teni son) కుమారుడు ఆశిష్ మిశ్రా , ఇతర నిందితులను అరెస్ట్​ చేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి వారం రోజులు అల్టిమేటం ఇస్తున్నట్లు తెలిపారు.

" కేంద్రమంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్​ చేసేందుకు మేము ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇచ్చాం. మృతిచెందిన రైతుల 13వరోజు కార్యక్రమం నాడు మళ్లీ అంతా సమావేశమవుతాం. భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తాం. ఈ ఘటనపై అనేక వీడియోలు ఉన్నాయి. అవి త్వరలో బయటకు వస్తాయి. కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా, అతని కుమారుడు ఆశిష్ మిశ్రా.. క్రిమినల్స్​ అని స్థానిక ప్రజలు తెలిపారు. డీజిల్​ దొంగతనం కేసులో వారు నిందితులుగా ఉన్నారని వివరించారు. "

-- రాకేశ్ టికాయిత్, రైతు ఉద్యమ నేత

మృతుల కుటుంబాలకు సంయుక్త కిసాన్ మోర్చా సంఘం అండగా ఉంటుందన్నారు. రైతుల మృతదేహాలకు మరోసారి పోస్ట్​మార్టం నిర్వహించాలన్నారు టికాయిత్. లఖింపుర్ ఘటన తర్వాత రైతులకు, కేంద్రానికి మధ్య కుదిరిన ఒప్పందంతో ఉద్యమం ఆగిపోదని.. రైతు చట్టాలను వెనక్కితీసుకునేంతవరకూ పోరాడతామన్నారు.

ఖేరి జిల్లా కలెక్టర్ మృతుల కుటుంబాలకు రూ. 45లక్షల చొప్పున మంగళవారం రాత్రి అందించారని లఖింపుర్ సమాచార కార్యాలయం పేర్కొంది.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Lakhimpur violence news) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటివి సహించొద్దు..

మరోవైపు లఖింపుర్ ఘటనపై పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ(charanjit singh channi latest news) స్పందించారు. ఇలాంటి పిరికిపంద చర్యలను సహించొద్దన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయటాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు చన్నీ. రైతు చట్టాలను రద్దు చేయాలని తాను అమిత్​షాను కోరినట్లు చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:

ఉద్రిక్తతల మధ్య లఖింపుర్​కు రాహుల్​ గాంధీ!

'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో'.. సిద్ధూ వార్నింగ్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.