కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా దేశవ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. అర్హులైన వారిలో ఎక్కువ మందికి టీకా అందించడమే లక్ష్యంగా.. ఇవాళ్టి నుంచి నాలుగురోజులపాటు ఈ ఉత్సవం కొనసాగనుంది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని.. టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 11నుంచి 14 వ తేదీ వరకూ టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రధాని సూచనల మేరకు టీకా ఉత్సవ్ చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై 83 రోజులు కాగా.. ఇప్పటివరకు 10 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. 10 కోట్ల డోసుల పంపిణీకి అగ్రరాజ్యం అమెరికాకు 89 రోజులు పడితే చైనాకు 102 రోజులు పట్టింది.
ఇదీ చూడండి: లైవ్: సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్