ETV Bharat / bharat

భక్తులు లేకుండానే త్రిచూర్​ పురం వేడుక - లాంఛనంగా నిర్వహించనున్న త్రిచూర్​ పురం వేడుక

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళలో నిర్వహించే త్రిచూర్​ పురం వేడుకను ఆలయ సంప్రదాయం ప్రకారం లాంఛనంగా మాత్రమే జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Thrissur Pooram
త్రిచూర్​ పురం వేడుక
author img

By

Published : Apr 20, 2021, 12:49 PM IST

కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కేరళలో నిర్వహించే త్రిచూర్​ పురం వేడుకపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం లాంఛనంగా మాత్రమే వేడుక జరపాలని నిర్ణయించింది. వేడుకలోకి ప్రజలకు అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొవిడ్​ నియమాలను పాటిస్తూ.. ఆలయ నిర్వహకులు మాత్రమే వేడుకలో పాల్గొననున్నారు. పురం వేడుకను పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని గతంలో వెల్లడించిన తిరువంబాడి, పరమెక్కవవు ఆలయ నిర్వహకులు.. ప్రభుత్వ నిర్ణయానికి సమ్మతి తెలిపారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పురం వేడుకను పూర్తి స్థాయిలో నిర్వహిస్తామన్న ప్రకటనపై రాష్ట్రంలో మేధావులు వ్యతిరేకించారు. త్రిచూర్​ పురం వేడుక వచ్చే శుక్రవారం జరగనుంది. గత ఏడాది కూడా ఈ వేడుక లాంఛనంగా జరిగింది.

ఇదీ చదవండి: ప్రధాని.. పోర్చుగల్, ఫ్రాన్స్​ పర్యటనలు రద్దు!

ఇదీ చదవండి: సీఈసీ సుశీల్‌ చంద్రకు కరోనా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.