ETV Bharat / bharat

మూడేళ్ల చిన్నారిపై దారుణం, బర్త్​డే పార్టీలో మత్తుపదార్థాలు ఇచ్చి గ్యాంగ్​రేప్ - ఉత్తర్​ప్రదేశ్ ఘజియాబాద్ న్యూస్

బిహార్​లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మైనర్. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బర్త్​డే పార్టీకి హాజరైన మహిళకు కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

rape
అత్యాచారం
author img

By

Published : Aug 17, 2022, 5:31 AM IST

బిహార్ అరారియాలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కూడా మైనరేనని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు బాధితురాల్ని వైద్యం కోసం ఫారబిసంగజ్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. నిందితుడు కూడా బాధితురాలి గ్రామానికి చెందినవాడేనని పోలీసులు తెలిపారు.

బర్త్​డే పార్టీలో దారుణం..
ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. గాజియాబాద్ జిల్లాలోని మోదీ నగర్​లో ఈ ఘటన జరిగింది. బర్త్​డే పార్టీకి హాజరైన బాధితురాలికి కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. ముగ్గురు నిందితులను శేఖర్, కృష్ణ, అర్జున్​గా గుర్తించినట్లు అదనపు ఏఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు.

ఇవీ చదవండి: మైనర్​పై గ్యాంగ్​రేప్, దారుణంపై రెండు నెలలుగా తల్లి మౌనం

జైలు ఎదుట బిడ్డ మృతదేహంతో తల్లి ఆవేదన, భర్త కోసం 7 గంటలు నిరీక్షించి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.