ETV Bharat / bharat

టైం బాంబుల కలకలం.. ఇంట్లోనే నిల్వ.. కాసేపు టెన్షన్ టెన్షన్​.. ఆఖరికి..

author img

By

Published : Feb 11, 2023, 6:58 PM IST

బిహార్​లో టైం బాంబులు కలకలం రేపాయి. ఓ ఇంట్లో మూడు టైం బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

bombs recoverd in bihar
బిహార్​లో బాంబులు స్వాధీనం

బిహార్​ ముజఫర్​పుర్​లో టైం బాంబులు స్థానికంగా కలకలం రేపాయి. తికోథియా గ్రామంలోని ఓ ఇంట్లో మూడు టైం బాంబులు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్ బృందంతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. మూడు టైం బాంబులకు నిర్వీర్యం చేసింది బాంబు స్క్వాడ్ బృందం. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనాస్థలిలో ఉన్న జావేద్ అహ్మద్​, సైఫ్ ఆలం సహా కొందరు అనుమానితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్కడ పలు అనుమానస్ఫద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమీప ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు తెలిపారు. నేరం రుజువైతే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

"మిథన్‌పుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో మూడు టైం బాంబులను స్వాధీనం చేసుకున్నాం. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

--రాకేశ్​ కుమార్​, ముజఫర్​పుర్​ ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.