ETV Bharat / bharat

600 ఏళ్ల నాటి దేవతల విగ్రహాలు స్వాధీనం.. విలువ ఎంతంటే?

author img

By

Published : Apr 14, 2022, 11:39 AM IST

Stolen Idols Recovered: పుదుచ్చేరిలో 600 వందల ఏళ్ల నాటి దేవతల విగ్రహాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి చోళ, విజయనగర రాజుల కాలం నాటివని అధికారులు భావిస్తున్నారు. విగ్రహాల విలువ రూ.12 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Puducherry Stolen Hindu idols
Puducherry Stolen Hindu idols

Stolen Idols Recovered: ఆరు వందల ఏళ్ల నాటి హిందూ దేవతల విగ్రహాలను తమిళనాడు సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.12 కోట్ల విలువైన ఈ విగ్రహాలలో.. నటరాజస్వామి, వేంద్ హరశివ, విష్ణుమూర్తి ప్రతిమలు ఉన్నట్లు సీఐడీ విగ్రహ విభాగం అధికారులు తెలిపారు. పుదుచ్చేరిలోని జోసెఫ్ కొలొంబానీ అనే వద్ద ఈ విగ్రహాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన ధ్రువపత్రాలేవీ అతడి వద్ద లేవని పేర్కొన్నారు. 600 ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్న ఈ విగ్రహాలను.. 1980కి ముందు హిందూ దేవాలయాల నుంచి చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Puducherry Stolen Hindu idols
వేంద్ హరిశివ విగ్రహం
Puducherry Stolen Hindu idols
విష్ణుమూర్తి విగ్రహం

Puducherry Stolen Hindu idols: ఈ విగ్రహాలు చోళ, విజయనగర సామ్రాజ్యాలు పాలన సాగించిన కాలం నాటివని అధికారులు చెబుతున్నారు. నటరాజ విగ్రహం రెండు అడుగుల ఎత్తు, 23 కేజీల బరువు ఉందని అధికారులు తెలిపారు. దీని విలువే రూ.6 కోట్లు ఉంటుందని చెప్పారు. మిగతా రెండు విగ్రహాలు రూ.3 కోట్ల చొప్పున ఉంటాయని లెక్కగట్టారు. ఈ విగ్రహాలను ఫ్రాన్స్​కు తరలించాలని నిందితులు గతంలో ప్రయత్నించారని అధికారులు చెప్పారు. అయితే, విగ్రహాలను స్మగ్లింగ్ చేయలేకపోయారని అన్నారు.

Puducherry Stolen Hindu idols
నటరాజ విగ్రహం

ఇదీ చదవండి: హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.