జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలో బలగాలు అప్రమత్తమయ్యాయి. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లో ముగ్గురు ఉగ్ర అనుచరులను పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది శనివారం సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ముష్కరుల నుంచి రెండు పిస్తోళ్లు, పది బుల్లెట్ మేగజైన్లు, రూ.3 లక్షల నగదు సహా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. వీరిని షరాఫత్ ఖాన్, సజ్జద్ షా, సాహిద్ అహ్మద్‌గా అధికారులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: PM Modi: జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ!
ఇదీ చూడండి: Encounter: ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం