ETV Bharat / bharat

స్కూల్​కు బంక్ కొట్టి ఆత్మహత్య.. పార్క్​లో విషం తాగిన బాలికలు.. ఏమైందంటే? - పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

మధ్యప్రదేశ్ ఇందోర్​లో దారుణం జరిగింది. పాఠశాలకు బంక్ కొట్టి ఓ పార్క్​కు వెళ్లిన ముగ్గురు బాలికలు విషం తాగి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఓ వ్యక్తి తన భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

three minor girls consumed
విషం తాగిన ముగ్గురు బాలికలు
author img

By

Published : Oct 29, 2022, 2:13 PM IST

మధ్యప్రదేశ్​ ఇందోర్​లో దారుణం జరిగింది. పాఠశాలకు బంక్​ కొట్టి అష్ట పట్టణం నుంచి ఇందోర్​ వెళ్లిన ముగ్గురు బాలికలు విషం తాగారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందగా.. మరొక బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఇందోర్​లోని ఓ పార్కులో విషం తాగారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికలను ఆస్పత్రికి తరలించి.. వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు బాలికలు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. వారంతా పాఠశాలకు వెళతామని ఇళ్ల నుంచి బయలుదేరి బస్సులో ఇందోర్ చేరుకున్నారు. ఓ బాలిక తన ప్రియుడు ప్రేమను నిరాకరించాడని ఆత్మహత్యకు పాల్పడగా.. మరో బాలిక కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మూడో బాలిక వీరిద్దరూ విషం తాగడం వల్ల ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు.

భార్య, అత్తపై పెట్రోల్ పోసి..
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​ సహారన్​పుర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిద్రిస్తున్న తన భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిందితుడి అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు నితిన్​కు కూడా మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ఈ ఘటన శనివారం వేకువజామున జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సహరానాపుర్​కు చెందిన రితికకు నితిన్​తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగుతుండేవి. ఈ క్రమంలో రితిక తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తన ఇంటికి తీసుకొచ్చేందుకు నిందితుడు తన అత్తవారింటికి వెళ్లగా.. భర్తతో వచ్చేందుకు రితిక నిరాకరించింది. ఈ కోపంతో నితిన్​ నిద్రిస్తున్న భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

కన్న కూతుర్ని అమ్మేసిన తండ్రి..
రాజస్థాన్ బుందీలో ఓ కసాయి తండ్రి కన్న కూతురిని రూ.15 లక్షలకు అమ్మేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్​ను కొనుగోలు చేసిన వ్యక్తి ఆమె బంధువే కావడం విశేషం. ఆ బంధువు.. బాలికను కొనుగోలు చేసిన తర్వాత ముంబయిలోని ఓ వ్యభిచార గృహానికి చిన్నారిని విక్రయించాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేయగా.. బాధితురాలు ముంబయిలో ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి తండ్రి, బాధితురాలిని కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి: పూజ కోసం ప్రసాదం చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. 30 మందికి పైగా..

కోటి మంది కలిసి ఒకేసారి గానం రికార్డు సృష్టించిన కన్నడిగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.