జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లా కేంద్రంలో భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
బాబా మొహల్లా ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా వారిపై ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల