ETV Bharat / bharat

టిప్పర్ బైక్ ఢీ, ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, అనాథగా మూడేళ్ల చిన్నారి - కుమార్తెను హత్య చేసిన తండ్రి

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడి అనాథగా మారింది. మరోవైపు, మతం మారడం ఇష్టం లేక ఓ తండ్రి తన కూతుర్ని గొంతుకోసి హత్య చేశాడు.

Three members of same family died in accident in Karnataka

author img

By

Published : Aug 24, 2022, 7:38 PM IST

కర్ణాటక బళ్లారిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల చిన్నారి అనాథగా మారిపోయింది. ప్రమాదంలో వీరేశ్(40), అతడి భార్య అంజలి(35), కుమారుడు దినేశ్(6) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరేశ్ కుమార్తె హనీ తీవ్రంగా గాయపడింది.

మొరార్జీ దేశాయ్ స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్నాడు వీరేశ్. బుధవారం యరగుడి ప్రాంతం నుంచి బళ్లారిలోని గఫూర్ టవర్​ వద్ద ఉన్న తన ఇంటికి వెళ్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి బైక్​పై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. వీరేశ్ బైక్​ను.. వెనక నుంచి వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో వీరేశ్, అతడి భార్య, కుమారుడు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ చిన్నారి హనీని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని బళ్లారి ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. టిప్పర్ డ్రైవర్​ను అరెస్టు చేశారు. టిప్పర్​ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

మతమార్పిడి ఇష్టం లేక..
ఉత్తరాఖండ్ హరిద్వార్​లో ఓ వ్యక్తి తన కన్నకూతుర్ని గొంతు కోసి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. మత మార్పిడి విషయంలో భార్యతో తలెత్తిన వివాదమే ఇంతటి దారుణానికి పాల్పడేలా చేసిందని నిందితుడు చెప్పాడు. ఘటన సమయంలో నిందితుడి భార్య ఇంట్లో లేదు. పుట్టింటికి వెళ్లింది.

నిందితుడిని కుల్దీప్​గా గుర్తించారు పోలీసులు. మతం మార్చుకోవడం ఇష్టం లేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 'నేను ముస్లింను వివాహం చేసుకున్నా. కూతురిని ముస్లిం మతంలోకి మార్చాలని నా భార్య బలవంతం చేస్తోంది. దీనిపై చాలాసార్లు వాదించుకున్నాం. మంగళవారం ఆమె తన పుట్టింటికి వెళ్లింది. నా కూతురిని చంపేసి, నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా' అని నిందితుడు వివరించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలిక శవాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం తరలించారు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో నిందితుడికి గాయాలయ్యాయని, ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు.

స్పృహ కోల్పోయేలా కొట్టిన టీచర్
రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఓ టీచర్ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. పరీక్ష రాసి ఆన్సర్ షీట్​ను ఆలస్యంగా ఇచ్చినందుకు స్పృహ కోల్పోయే విధంగా కొట్టాడు. కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ కునాల్ అనే 13ఏళ్ల విద్యార్థి ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పరీక్ష నిర్వహించగా.. కునాల్ ఆలస్యంగా ఆన్సర్ షీట్ ఇచ్చాడని టీచర్ చెయ్యి చేసుకున్నాడు. తీవ్రంగా కొట్టేసరికి కునాల్ స్పృహ తప్పి పడిపోయాడు. సుమారు 20 మంది విద్యార్థులు కునాల్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారని విద్యార్థి తల్లి వెల్లడించారు. స్పృహ కోల్పోయే సరికి అందరూ ఆందోళన చెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పాఠశాలలో సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

కిరోసిన్ తాగి మృతి
తమిళనాడులో ఘోరం జరిగింది. మంచినీళ్లు అనుకుని కిరోసిన్ తాగిన ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. కాంచీపురంలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా పక్కనే ఉన్న బాటిల్‌లోని కిరోసిన్ తాగింది. దీంతో ఆ చిన్నారి స్పృహ తప్పిపడిపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలిక నాలుగురోజుల తర్వాత చనిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి కిరోసిన్ తాగి మృత్యువాత పడటం వల్ల ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.

కిక్​బాక్సర్ మృతి
అరుణాచల్ ప్రదేశ్ కిక్​బాక్సర్ యోరా తడే(24) ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలో జరిగిన వాకో ఇండియా సీనియర్స్, మాస్టర్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న అతడు.. గేమ్​లో ప్రత్యర్థి దెబ్బలకు తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కాగా.. ప్రాథమిక చికిత్స నిర్వహించి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. మూడు రోజుల పాటు ఐసీయూలోనే ఉన్న యోరా.. మంగళవారం తుదిశ్వాస విడిచాడు.

kickboxer yora dead
కిక్​బాక్సర్ యోరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.