ETV Bharat / bharat

బస్సు బోల్తా- ముగ్గురు వలస కూలీలు మృతి

దిల్లీలో లాక్​డౌన్​తో సొంతూళ్లుకు బయలుదేరిన ఓ వలసకూలీల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తా కొట్టి.. ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Bus accident
బస్సు బోల్తా
author img

By

Published : Apr 20, 2021, 2:25 PM IST

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​ జిల్లాలో జోరాసిలో బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వలస కూలీలు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. దిల్లీ నుంచి ఛతర్​పుర్​, టికమ్​గఢ్​ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మద్యం సేవించి డ్రైవింగ్​​

కరోనా వేళ దిల్లీలో వారం రోజులు లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురైంది. అయితే బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. తాము ఎంత చెప్పినా డ్రైవర్​ వినలేదని చెబుతున్నారు. అంతేకాకుండా డ్రైవర్​.. మద్యం సేవించి బస్సు నడిపినట్లు ఆరోపించారు.

ఇదీ చూడండి: కొవిడ్​​ మృతదేహాల కోసం పడిగాపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.