ETV Bharat / bharat

నాసిక్​లో బయటపడ్డ 2 వేల ఏళ్ల నాటి గుహలు - ఆర్కియాలజీ సర్వే ఆఫ్​ ఇండియా తాజా

మహారాష్ట్ర నాసిక్​లో మూడు అసంపూర్ణంగా చెక్కి ఉన్న గుహలు బయటపడ్డాయి. ఇవి 2,200 ఏళ్ల క్రితం నాటివని నిపుణులు భావిస్తున్నారు. బుద్ధపూర్ణిమ రోజు ఇవి బయటపడటం విశేషం.

Incomplete caves
పురాతన గుహలు
author img

By

Published : Jun 5, 2021, 7:40 PM IST

అసంపూర్ణంగా చెక్కి ఉన్న మూడు గుహలు.. మహారాష్ట్రలోని నాసిక్​లో బయటపడ్డాయి. ఇవి బుద్ధుని కాలానికి చెందినవని విశ్లేషకులు చెబుతున్నారు. నాసిక్​లోని త్రిరశ్మి బుద్ధ గుహలకు పైభాగంలో 2,565వ బుద్ధ పూర్ణిమ రోజు ఇవి బయల్పడటం విశేషం.

ఈ మూడు గుహలు 2,200 ఏళ్ల కంటే పురాతనమైనవని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి అసంపూర్ణంగా చెక్కి ఉన్నాయని తెలిపారు. నాసిక్​లో ఇప్పటివరకు బయటపడ్డ గుహల్లో ఇవే అత్యంత పురాతమనమైనవని అసిస్టెంట్​ సీనియర్​ గార్డియన్​ అతుల్​ భోసేకర్​ తెలిపారు.

Incomplete caves
నాసిక్​లో బయటపడ్డ గుహలు
Incomplete caves
గుహలోపలి భాగం

రాకేశ్​ షిండే, మైత్రేయి భోసేకర్(ఆర్కియాలజిస్టు), సునీల్ ఖారే(స్క్రిప్ట్​ ఎక్స్​పర్ట్​), సలీమ్​ పటేల్​(సీనియర్ ఉద్యోగి, ఏఎస్​ఐ), సాక్షి భోసేకర్​ సభ్యులుగా ఉన్న ఆర్కియాలజీ బృందం ఈ గుహలను కనుగొంది. దీనిపై తాము డాక్యుమెంటేషన్​ తయారు చేస్తామని త్వరలోనే ఏఎస్​ఐ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్​ ఇండియా) ముందు ప్రదర్శిస్తామని వారు చెప్పారు. వీటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని గుహలు బయటపడే అవకాశం ఉందన్నారు.

Incomplete caves
నాసిక్​లో బయటపడ్డ గుహలు

నాసిక్-ముంబయి రహదారిపై ఉన్న త్రిరశ్మి బద్ధ గుహల్లో ఇప్పటివరకు మొత్తం 24 గుహలను అధికారులు కనుగొన్నారు. ఇవన్నీ 2200 సంవత్సరాల క్రితం నాటివని తెలిపారు. వీటిపై పాలిభాష చెక్కి ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: 15 అడుగుల కింగ్​ కోబ్రాను చూశారా?

ఇదీ చూడండి: మిద్దెపై అడవిని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.