ETV Bharat / bharat

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి - ఝార్ఖండ్

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు చెరువులోకి దూకడం వల్ల ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబ సభ్యుల రోదన చూపరులను కలచివేసింది.

Three children fell into a pond and died in Jharkhand
చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
author img

By

Published : Mar 7, 2021, 11:33 PM IST

ఝార్ఖండ్​లో తీవ్ర విషాదం జరిగింది. రామ్​గఢ్​ జిల్లాలో మంగన్​పుర్​లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Three children fell into a pond and died in Jharkhand
చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

గ్రామంలోని చెరువు పక్కన ఆడుకోవడానికి ముగ్గురు చిన్నారులు వెళ్లారు. అందులో ఒక చిన్నారి చేతులు కడుక్కుందామని చెరువు దగ్గరికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. ఎంతకీ ఆ బాలుడు రాకపోవడం వల్ల మరో చిన్నారి అతన్ని వెతుకుతూ వెళ్లగా చెరువులో కనిపించాడు. కాపాడదామని ఈ బాలుడు చెరువులోకి దూకాడు. దాంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు.

వీరిద్దరూ ఇంకా రావటంలేదని మూడో బాలుడు వారిని వెతుకుతూ వెళ్లగా వారు చెరువులో మునిగిపోతూ కనిపించారు. వారిని కాపాడదామని ఈ బాలుడు చెరువులో దూకాడు. దాంతో చెరువులో ముగ్గురు మునిగి చనిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, చెరువు దగ్గరికి వచ్చి చిన్నారులను బయటికి తీయగా అప్పటికే వారు చనిపోయారు. దాంతో ఆ కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది.

రామ్​గఢ్​ ఎమ్మెల్యే మమ్మత దేవి వచ్చి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిన్నారులు ఒకరినొకరు కాపాడబోయి చెరువులో పడి చనిపోయారని డీఎస్పీ సంజీవ్​ కుమార్​ మిశ్రా తెలిపారు.

ఇదీ చూడండి: ట్రాక్​పై పల్టీలు కొట్టి.. రేసులో దూసుకెళ్లిన కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.