ETV Bharat / bharat

మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం.. శ్మశానంలో మైనర్ బాలిక రేప్​ - పంజాబ్ లుథియానాలో మైనర్ బాలికపై అత్యాచారం

మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశాడు. ఈ అమానుష ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

3.5 year old girl raped in karnataka
మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం
author img

By

Published : Feb 1, 2023, 1:05 PM IST

Updated : Feb 1, 2023, 1:23 PM IST

మానవత్వం మరిచి మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

ఇదీ జరిగింది..
బాగల్‌కోట్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాలతో తన భర్త నుంచి విడిపోయి మూడున్నరేళ్ల కుమార్తెతో కలిసి కామాక్షిపాళ్యంలోని కావేరీ నగర్‌లో నివసిస్తోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తుండగా.. అక్కడే ఆమెకు 26 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు కూడా ఆమె ఇంట్లోనే ఉండేవాడు. ఆమె పనికి వెళ్లినప్పుడు కుమార్తెను చూసుకునేవాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. ఇంతలో ఇంటికి వచ్చిన మహిళ.. కుమార్తెను చూసి షాక్​కు గురైంది. దీనిపై అతడిని ప్రశ్నించగా.. ఆమెపై ఎదురుదాడి చేశాడు. స్థానికులు సహాయంతో పోలీసులను ఆశ్రయించిన మహిళ అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు.

శ్మశానానికి తీసుకెళ్లి.. మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం..
మరోవైపు పంజాబ్​ లుథియానాలో ఓ యువకుడు తన ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికను శ్మశానానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Feb 1, 2023, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.