ETV Bharat / bharat

గుర్రానికి అంత్యక్రియలు- వేల మంది హాజరు

వేలాది మంది ప్రజలు కరోనా నిబంధనల్ని అతిక్రమించి గుర్రం అంత్యక్రియలకు హాజరయ్యారు . ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది.

horse
గుర్రం అంత్యక్రియలు
author img

By

Published : May 24, 2021, 6:54 AM IST

గుర్రానికి అంత్యక్రియలు- వేల మంది హాజరు

కరోనా నిబంధనలను అతిక్రమించి గుర్రం అంత్యక్రియలకు వేల మంది తరలివచ్చారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది.

కాదసిద్దేశ్వర స్వామి పేరు మీద గోఖక్​ తాలుకా ప్రజలు శౌర్య అనే పేరు గల గుర్రాన్ని వదిలారు. అయితే అది శనివారం రాత్రి చనిపోయింది. దాని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మొదట పెద్దఎత్తున శవయాత్ర నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి వేల మంది ప్రజలు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్​.. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా అక్కడికి పోలీసుల్ని తరలించారు. 15 మందిపై కేసు నమోదు చేశారు. అంత్యక్రియలకు హాజరైన అందరికీ కరోనా పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి: తహశీల్దార్​ నాగిని డ్యాన్స్​.. లాక్​డౌన్​ నిబంధనలు బేఖాతర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.