ETV Bharat / bharat

వారికి రాహుల్​ షాక్​.. పార్టీ వీడి వెళ్లాలంటూ...

భాజపాకు భయపడేవారు పార్టీని విడిచి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. అలాంటి వారు తమకు అవసరం లేదన్నారు. ఎవరికీ భయపడకుండా పని చేసేవారు పార్టీలో చేరొచ్చని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ సోషల్​ మీడియా కార్యకర్తలతో వర్చువల్​గా సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ పార్టీ
author img

By

Published : Jul 16, 2021, 6:24 PM IST

భారతీయ జనతా పార్టీని, వాస్తవాలను ఎదుర్కొనేందుకు భయపడేవారు స్వేచ్ఛగా పార్టీని విడిచి వెళ్లొచ్చని స్పష్టం చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. దేనికీ భయపడకుండా పని చేసేవారు పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో రాహుల్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పార్టీ సామాజిక మాధ్యమాల కార్యకర్తలతో వర్చువల్​గా సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​. ఈ కార్యక్రమంలో సుమారు 3,500 మంది కార్యకర్తలు పాల్గొన్నట్లు సమాచారం.

" భయమనేదే లేనివారు చాలా మంది ఉన్నారు. కానీ వారు కాంగ్రెస్​కు వెలుపల ఉన్నారు. వారంతా మనవారు. వారిని పార్టీలోకి తీసుకురండి. పార్టీలో భయంతో బతుకుతున్న వారు వెంటనే వెళ్లిపోండి. వారు ఆర్​ఎస్​ఎస్​కు చెందిన వారు. వాళ్లు వెళ్లిపోవాల్సిందే. వారిని స్వేచ్ఛగా వదిలేద్దాం. మనకు వాళ్లు అవసరం లేదు. భయం లేకుండా పని చేసేవారే కావాలి. అదే మన సిద్ధాంతం. ఇదే నేను మీకు ఇచ్చే సందేశం. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

జోతిరాదిత్య సింధియాను ఉదాహరణగా చూపిస్తూ కార్యకర్తలతో రాహుల్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఇంటిని రక్షించుకునేందుకు భయంతో ఆర్​ఎస్​ఎస్​లో చేరారని పేర్కొన్నట్లు చెప్పాయి. కార్యకర్తల్లోని వివిధ వర్గాలకు చెందిన 10 మంది యువతతో గాంధీ వ్యక్తిగతంగా మాట్లాడారని, ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఇటీవల చాలా మంది సీనియర్​ నేతలు పార్టీని వీడి భాజపాలో చేరారు. అందులో సింధియా, జితిన్​ ప్రసాద వంటి కీలక నేతలు ఉన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్​ నేతలు నారాయణ రాణే, రాధాక్రిష్ణ విఖే పాటిల్​లు 2019లో పార్టీని వీడారు.

ఇదీ చూడండి: 'పిచ్చోడి చేతిలో రాయిలా దేశద్రోహ చట్టం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.