ETV Bharat / bharat

ఈ షేవింగ్​ బ్రష్​తో 'వైరస్'​ దూరం!

సెలూన్లలో షేవింగ్ కిట్‌లు సామూహికంగానే వాడుతుంటారు. బ్లేడు మాత్రం మార్చి ఒకే రేజర్ దీర్ఘకాలం వాడతారు. హెపటైటిస్ వైరస్ ఆ బ్రష్‌ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. అయితే బ్రష్‌లు మార్చడం అంత తేలికైన పని కాదు. అందుకే ఎలాంటి ప్రమాదం లేకుండా ఒకసారి వాడి పడేసేలా తక్కువ వ్యయంతో షేవింగ్ బ్రష్‌ రూపొందించింది ఓ మహిళ.

This shaving brush prevent hepatitis virus from others
ఈ షేవింగ్​ బ్రష్,​ చేస్తోంది ఆ వైరస్​ను దూరం
author img

By

Published : Jan 25, 2021, 7:03 PM IST

తక్కువ వ్యయంతో వాడిపడేసే ఆర్గానిక్​ షేవింగ్ బ్రష్‌

కొన్నేళ్ల క్రితం పత్రికలో వచ్చిన ప్రకటన.. ఓ ఆవిష్కరణకు కారణమైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మాదాల సౌజన్య ఓ అంకుర సంస్థ స్థాపించేలా ప్రేరేపించింది. షేవింగ్ బ్రష్‌ల వల్ల ప్రాణాంతక హెపటైటిస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకున్న ఆమె.. పరిష్కారం గురించి ఆలోచించారు. ఆ పరిశోధనలో నుంచి వచ్చిందే ఆర్గానిక్ షేవింగ్ బ్రష్.

This shaving brush prevent hepatitis virus from others
ఆర్గానిక్ షేవింగ్ బ్రష్​లు

ఆర్గానిక్ షేవింగ్ బ్రష్​ను పరిశీలిస్తోన్న ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు

ఆర్గానిక్​ షేవింగ్​ బ్రష్​తో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

హెచ్ఐవీ వ్యాప్తి బాగా పెరిగిన దశలో ఒకరు వాడిన బ్లేడ్‌లు మరోసారి వినియోగించరాదన్న అవగాహన ప్రజల్లో వచ్చింది. అయితే ఇప్పటికీ.. సెలూన్లలో షేవింగ్ కిట్‌లు సామూహికంగానే వాడుతున్న పరిస్థితి. బ్లేడు మాత్రం మార్చి ఒకే రేజర్ దీర్ఘకాలం వాడతారు. హెపటైటిస్ వైరస్ ఆ బ్రష్‌ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంది. బ్రష్‌లు మార్చడం అంత తేలికైన పని కాదు. అందుకే ఎలాంటి ప్రమాదం లేకుండా ఒకసారి వాడి పడేసేలా తక్కువ వ్యయంతో షేవింగ్ బ్రష్‌ రూపొందించారు సౌజన్య.

ఈటీవీ భారత్​తో మాదల సౌజన్య, ఆర్గానిక్ షేవింగ్ బ్రష్ రూపకర్త

"ఈ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో మొదట్లో తెలియలేదు. పరిశోధనలో భాగంగా చాలావాటిని పరీక్షించా. చివరకు ఈ ఫైబర్​ సరిగ్గా కుదిరింది. ప్రాసెసింగ్​ తర్వాత ఫైబర్‌ను బ్రష్‌కు అనుకూలంగా తయారు చేసుకోగలిగాం."

-మాదాల సౌజన్య, ఆర్గానిక్ షేవింగ్ బ్రష్ రూపకర్త

ఏడాదిపాటు పరిశోధన చేసిన సౌజన్య.. రకరకాల మొక్కలు పరిశీలించి అరటినారతో దీనిని రూపొందించారు. గుంటూరులోని అనంతవరంలో తయారీకేంద్రం ఏర్పాటుచేశారు. బోధ పేరుతో 10 రూపాయలకే ఈ బ్రష్‌ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఒక్కసారి వాడి పడేసే ఆర్గానిక్ బ్రష్‌తో పాటు ప్లాస్టిక్ రేజర్లను కిట్‌ రూపంలో కలిపి అందిస్తున్నారు. ఈ రేజర్‌కు బ్లేడ్ పెట్టి, సీల్ వేస్తారు. బ్లేడ్ మార్చి వాడుకునే వీలుండదు.

"అరటి రైతులకు కూడా అదనపు లాభం వస్తుంది. గెల కొట్టేసిన తర్వాత వాటిని చేల బయట పడేయడానికి కూడా రైతుకు కొంచెం ఖర్చవుతుంది. వాళ్లకొచ్చే లాభంలో దీనికోసమే కొంత మొత్తం కేటాయించాలి. ఈ విధంగా వాళ్లకు కొంచెం ఖర్చు తప్పుతుంది."

అరటినారతో తయారైన ఈ బ్రష్‌తో ఆరోగ్యానికి భరోసా లభించడమే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ వల్ల స్థానిక మహిళలకు ఉపాధి కూడా దక్కుతోంది.

ఉపాధి పొందుతోన్న మహిళలు

"రెండుమూడు గ్రామాలు దాటి, పొలానికి వెళ్లాల్సి వస్తోంది. బోధ పేరుతో బ్రష్‌లు తయారుచేసే పరిశ్రమ పెట్టారని తెలుసుకుని, ఇక్కడే ఉంటున్నాం. ఊళ్లోనే ఉంది కాబట్టి, రావడానికి సులభంగా ఉంది. మేమూ వస్తామంటూ మరో నలుగురు అడుగుతున్నారు. గృహిణులు కూడా ఇక్కడికొచ్చి పనిచేసేందుకు వీలుగా ఉంటుంది."

-నాగలక్ష్మి, ఉపాధి పొందుతున్న మహిళ

"పని బాగుంది. బ్రష్లు, లేజర్లు చేయడం, ఏ పనైనా బాగుంది. ఆడవాళ్లకు పని చాలా సులువుగా ఉంది. పొలంపని కంటే సులభం. పొలంపనికి నాలుగైదు గ్రామాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. ఇబ్బందిగా ఉన్నందున ఇలాంటివేవైనా పెడితే వద్దామనుకున్నాం. పెట్టారు, వచ్చాం."

-జ్యోతి, ఉపాధి పొందుతున్న మహిళ

ప్రస్తుతం 2వేలకు పైగా షేవింగ్ కిట్‌లు ఇక్కడ తయారవుతున్నాయి. ఉత్పత్తిని మరింత విస్తృతం చేసి, ఎక్కువమందికి ఉపాధి కల్పించే దిశగా సౌజన్య కృషి చేస్తున్నారు.

ఇదీ చూడండి: 13 ఏళ్ల బాలిక 'కాన్వాస్'​ కళ- నైపుణ్యం భళా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.