మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కోలార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పెళ్లి పేరుతో 13 మందిని మోసం చేసిందో ఓ బృందం. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌తో నడపుతూ.. పెళ్లిపై ఆసక్తి చూపించేవారిని లక్ష్యంగా చేసుకుని ఒకే యువతి ఫొటోతో వారందరినీ బురిడీ కొట్టించింది. అవసరాలకు డబ్బులు తీసుకుని తీరా సమయం వచ్చేసరిగా కార్యాలయంతో సహా ఎవరూ కనిపించేవారు కాదు. వారంతా ఒకే అమ్మాయి ఫొటో చూపించి ఫిర్యాదు చేయగా.. విస్తుపోవడం పోలీసుల వంతైంది.
రూ.2.50 లక్షలు టోకరా
వరుసగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని తెలుసుకున్న ఎస్పీ సాయి కృష్ణ... సమస్యను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టారు. "నిందితురాలు వివాహం పేరుతో రూ.2.50లక్షలు మోసానికి పాల్పడినట్లు తేలింది. పెళ్లి చేస్తామని చెప్పి, సమయం వచ్చేసరికి ఆ యువతి మాయమయ్యేంది. కార్యాలయం మూతపడేది. ఇదే విధంగా 13 మంది మోసం పోయారు" అని సాయి తెలిపారు.
నకిలీ మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్
పెళ్లి చేసుకోవాలనుకునేవారే లక్ష్యంగా చేసుకుంది ఆ బృందం. ఇందుకు ఓ మ్యాట్రిమోనియల్ వైబ్‌సైట్‌ను వేదికగా ఎంచుకుంది. బాధితులకు ఫోన్ చేసి తన కోసం మంచి అమ్మాయిని చూశామని చెప్పేవారు. పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి కనబరిచినట్లయితే ఆ యువతి ఫొటోను పంపించేవారు. ఒక వేళ అంతా బాగుండి పెళ్లి వరకు వస్తే.. వారి నుంచి కొంత డబ్బు తీసుకునేవారు. అందులో ఆ యువతికీ కొంత సొమ్ము ముట్టజెప్పేవారు. అలా బాధితుల నుంచి సాధ్యమైనంత డబ్బు రాబట్టాక... ఆ ఫోన్ నెంబరు స్విచ్ ఆఫ్ చేసేవారు.
బాధితుల్లో ఎక్కువ మంది వారే..
బాధితుల్లో ఎక్కువ మంది గ్వాలియర్, చంబల్ డివిజన్‌కు చెందినవారేనని అధికారులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామని.. మిగిలినవారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. బాధితులు కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: మహారాష్ట్ర పోలీసులపై యువకుల దాడి