ETV Bharat / bharat

'మూడో వేవ్​కు అవకాశాలు తక్కువే'

భారత్​లో కరోనా మూడో దశ వచ్చేందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఒకవేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది.

icmr study
ఐసీఎంఆర్
author img

By

Published : Jun 26, 2021, 1:04 PM IST

భారత్​లో కరోనా మూడో ఉద్ధృతి రావటానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనపత్రం వెల్లడించింది. ఒక వేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఇప్పటి పరిస్థితులను, రాబోయే ఉద్ధృతులను ఎదుర్కోవటంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపింది.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్యనిపుణులు సందీప్ మండల్​, సమీరన్, పండా, లండన్​లోని ఇంపీరియల్ కాలేజ్​కు చెందిన నిమలన్ అరినమిన్​పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయన పత్రం ఇండియన్ జర్నల్​ ఆఫ్ మెడికల్ రీసెర్చ్​లో ప్రచురితమైంది.

ముప్పు తక్కువే..

రోగనిరోధక శక్తి క్షీణించటం, రోగనిరోధక శక్తిని తప్పించుకొనేలా వైరస్​లో మార్పులు రావటం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో అభిప్రాయపడ్డారు. రెండు సందర్భాల్లోనే మూడో ఉద్ధృతి తలెత్తడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

అందులో..

1. కొత్త వేరియంట్​కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో అది రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగాలి.

2. సంక్రమణాన్ని తగ్గించగలిగే లాక్​డౌన్​ను పూర్తిగా ఎత్తివేయాలి.

ఈ రెండు కారణాల వల్ల ఒకవేళ మూడో వేవ్ వచ్చినప్పటికీ అది రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వీరు అధ్యయన పత్రంలో అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : డెల్టా రకంపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ భేష్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.