Third Wave Peak In india: కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్ వ్యాల్యూ జనవరి 14 నుంచి 21 మధ్య మరింత తగ్గి 1.57కు చేరినట్లు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు తెలిపారు. మూడో వేవ్‌లో వైరస్ బారిన పడే వారి సంఖ్య రానున్న 14 రోజుల్లో మరింత పెరిగి.. దేశ జీవనకాల గరిష్ఠాన్ని తాకుతుందని అంచనా వేశారు. ఆర్ వ్యాల్యూ 1 కంటే తక్కువగా నమోదు అయితే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.
ఐఐటీ మద్రాస్ వెల్లడించిన దాని ప్రకారం దేశంలో ఆర్ వ్యాల్యూ గతంలో ఈ విధంగా నమోదు అయ్యింది.
- జనవరి 14 నుంచి 21 వరకు 1.57
- జనవరి 7 నుంచి 13 వరకు 2.2
- జనవరి 1 నుంచి 6 వరకు 4
- డిసెంబర్ 24 నుంచి 31 వరకు 2.9 గా నమోదు అయినట్లు మద్రాస్ ఐఐటీ పేర్కొంది.
ఈ వ్యాల్యూని కంప్యూటేషనల్ మోడలింగ్ ద్వారా ప్రాథమిక విశ్లేషణ జరిపి లెక్కించినట్లు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు తెలిపారు. ఆర్ వ్యాల్యూ ముంబయిలో 0.67, దిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్‌కతాలో 0.56 గా నమోదు అయినట్లు పేర్కొన్నారు. ముంబయి, కోల్‌కతాలో ఆర్ వ్యాల్యూ ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకుని తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. దిల్లీ, చెన్నైలో ఇంకా ఒకటికి దగ్గరగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: దేశంలో 3 లక్షల 33 వేల కొత్త కేసులు.. 525 మరణాలు