కర్ణాటక చామరాజ్నగర్ జిల్లా అడవుల్లో దొరికిన నాలుగు పులిపిల్లల్లో మూడు.. ఆకలి కారణంగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండు పిల్లలు అటవీ ప్రాంతంలోనే మరణించగా.. మరోకటి చికిత్స పొందుతూ మైసూర్ జూలో ప్రాణం వీడింది.
![Third tiger cub dies of starvation in Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-cnr-06-tiger-av-ka10038_29032021213747_2903f_1617034067_50_3003newsroom_1617078205_423.jpg)
నాలుగోది మగ పులి పిల్ల అని ఆధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి పిల్లలు దొరికిన ప్రాంతం నుంచి పాదముద్రల సాయంతో తల్లి పులి కోసం అటవీ సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: బిహార్లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం