ETV Bharat / bharat

ఫైటర్‌ పైలట్‌ విలువ వెలకట్టగలమా.! - మిగ్​-29కే

దేశంలో విమానాలు, హెలికాఫ్టర్లు ఒకదానివెంట మరొకటి కుప్పకూలుతున్నాయి. ఈ ఘటనల్లో ఎంతో మంది పైలట్లు బలవుతున్నారు. అయితే.. కోల్పోయిన విమానంతో పోలిస్తే.. పైలట్​ ప్రాణమే అత్యంత నష్టాన్ని చేకూరుస్తుంది. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారుతున్నా ఈ దుర్ఘటనలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు.

THIRD CRASH PUTS RUSSIAN MIG-29K BACK IN FOCUS
దేశంలో విమానాలు, హెలికాఫ్టర్లు ఒకదానివెంట మరొకటి కుప్పకూలుతున్నాయి. ఈ ఘటనల్లో ఎంతో మంది పైలట్లు బలవుతున్నారు. అయితే.. కోల్పోయిన విమానంతో పోలిస్తే.. పైలట్​ ప్రాణమే అత్యంత నష్టాన్ని చేకూరుస్తుంది. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారుతున్నా ఈ దుర్ఘటనలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు.
author img

By

Published : Dec 8, 2020, 5:16 AM IST

భారత‌ యుద్ధవిమానాలు.. హెలికాప్టర్లు.. రవాణా విమానాలు వరుసగా నేల కూలుతూనే ఉన్నాయి. ఫలితంగా అనేక మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది అత్యంత విలువైన యుద్ధవిమానం కోల్పోయామని అంటారు. కానీ, పైలట్‌ను కోల్పోవడం దేశానికి అంతకంటే పెద్ద నష్టం. ప్రభుత్వాలు మారుతున్నా.. ఈ దుర్ఘటనలు మాత్రం ఆగడంలేదు. గత నెలాఖరులో గోవా సమీపంలో ఓ మిగ్‌-29కే శిక్షణ విమానం సముద్రంలో కుప్పకూలింది. ఒక శిక్షణా పైలట్‌ ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతుండగా.. ఆచూకీ గల్లంతైన మరో పైలట్​ నిషాంత్‌ సింగ్ మృతదేహం అరేబియా సముద్రంలో లభ్యమైంది. గోవాలోని ఐఎన్‌ఎస్‌ హంస వైమానిక స్థావరానికి చెందిన మూడు మిగ్‌-29కేలు ఏడాది వ్యవధిలో కుప్పకూలడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.

ఫైటర్‌ పైలట్‌ ట్రైనింగ్‌ అంత ఈజీ కాదు..

ఫైటర్‌ పైలట్‌ శిక్షణ అంత తేలిగ్గా ఉండదు. మూడు దశల్లో 285 గంటల కఠిన శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి అంశంలో 100శాతం ప్రదర్శన చేస్తేనే ముందుకు వెళతారు. పైలట్‌ శిక్షణ ఖర్చు బహిర్గతం చేయకపోయినా.. కోట్లల్లోనే ఉంటుంది. ఒకసారి శిక్షణ విమానం గాల్లోకి ఎగరాలంటే చాలా సపోర్టింగ్‌ టీమ్స్‌‌ పనిచేయాల్సి ఉంటుంది. రాడార్లు, వాటి నిర్వహణ, ఏటీసీ నిర్వహణ, అత్యంత నిపుణులైన శిక్షకులను ఏర్పాటు చేయడం, రన్‌వేను సిద్ధం చేయడం, లోకల్‌ ఫ్లైయింగ్‌ ఏరియా, సిమ్యూలేటర్లు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖర్చుతో కూడుకున్నవి.

అన్ని టెక్నాలజీలను సొంతంగా తయారుచేసుకొనే అమెరికా వంటి దేశాల్లోనే ఎఫ్‌-22 రాప్టర్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 10.90 మిలియన్‌ డాలర్లు(ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం) సీ130జే రవాణా విమాన పైలట్‌ శిక్షణ ఖర్చు 2.47 మిలియన్‌ డాలర్లు. భారత్‌ సీ-130 రకం విమానాలను వినియోగిస్తుంది. ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్‌ పైలట్‌ శిక్షణ ఖర్చు 5.62 మిలియన్‌ డాలర్లు. భారత్‌లో కూడా శిక్షణకు 2015 లెక్కల ప్రకారం రూ.13 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ విలువ ఇంకా పెరిగి ఉంటుంది. అన్నిటికీ మించి పైలట్‌కు సొంతమయ్యే అనుభవం అత్యంత విలువైనది. దీనికి వెలకట్టలేం. తాజాగా ఆచూకీ గల్లంతైన నిషాంత్‌ పైలట్లకు శిక్షకుడు. అంటే నావికాదళ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగ్‌ హెచ్చరించినా..

భారత నావికాదళంలో విమాన వాహక నౌకలపై మిగ్‌-29కెలను వినియోగించడాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఎప్పుడో తప్పుపట్టింది. 2016 జులైలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విమానాల్లో చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేవల్‌ ఫైటర్‌ జెట్‌ ఎయిర్‌ ఫ్రేమ్‌లో చిక్కులు ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా ఇందులో వినియోగించే ఆర్‌డీ-33 ఎంకే ఇంజిన్‌, ఫ్లైబై వైర్‌ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. ఈ విమానంలో రెండు ఇంజిన్లు ఉంటాయి. 2016 నాటికి ఒక ఇంజిన్‌ మోరాయించడం వల్ల.. మిగిలి ఇంజిన్‌తోనే తంటాలుపడి ల్యాండ్‌ అయిన ఘటనలు 10 చోటు చేసుకొన్నాయని పేర్కొంది. ఈ ఇంజిన్‌ జీవిత కాలం కూడా తక్కువగా ఉంటోంది.

నిషాంత్‌కు ఏమై ఉంటుంది?

యుద్ధ విమానాలు కూలిపోతాయని తెలిసినప్పుడు పైలట్‌ దానిని ల్యాండ్‌ చేయడానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. ఇక తప్పదు అనుకున్నప్పుడు విమానం నుంచి ఎజెక్ట్‌(బయటకు వచ్చేయడం) అవుతారు. దీనికి పైలట్‌ సీటు కింద రాకెట్‌ ఇంజిన్‌ వంటి ఓ వ్యవస్థ ఉంటుంది. తొలుత పైలట్‌ పైన ఉన్న గ్లాస్‌ను తొలగిస్తారు. అనంతరం ఆ రాకెట్‌ వ్యవస్థ పనిచేసి పైలట్‌ అత్యంత వేగంతో గాల్లోకి ఎగిరిపోతారు. ఆ తర్వాత అతడి నుంచి సీటు వేరుగా అయిపోతుంది. అతనికి ఉన్న పారాచూట్‌ తెరుచుకొని కిందకు దిగుతాడు. ఈ పక్రియ అత్యంత వేగంగా జరిగిపోవాలి. ఏ మాత్రం ఆలస్యమైనా.. గాల్లో ప్రయాణిస్తున్న ఆ యుద్ధ విమానం తోకభాగం పైలట్‌ శరీరాన్ని తాకుతుంది. దీంతోపాటు తగినంత ఎత్తులో ఎజెక్ట్‌ కాకపోతే పారచూట్‌ తెరుచుకునే సమయం లభించక నీటిలో లేదా నేలపై పడిపోతాడు.

మరో విషయం ఏంటంటే.. పైలట్‌ సీటు రాకెట్‌ వేగంతో గాల్లోకి లేవడం వల్ల.. అతని వెన్నుపూస దెబ్బతినడం, లేదా తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు నీటిలో పడినా వెంటనే ఈదలేక ప్రాణాలు కోల్పోతారు. వారి ఆచుకీ తెలుసుకొనేందుకు సూట్‌లో ఓ లొకేటర్‌ ఉంటుంది. అది నీటిలోపడితే పనిచేయదు. దీంతో ఆచూకీ కనుగొనడం కష్టంగా మారుతుంది. ఒకవేళ పైలట్‌ ప్రాణాలతో ఉంటే అతనికి కొంతకాలానికి సరిపడా అత్యంత శక్తిమంతమైన ఆహారం కూడా వారి సూట్‌లో ఉంటుంది.

ఇదీ చదవండి: మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.