ETV Bharat / bharat

వామ్మో వీళ్లేం దొంగలు- స్పూన్​ కూడా వదల్లేదు!

indore thief news: మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఓ దొంగతనం జరిగింది. ఈ చోరీ జరిగిన విధానం చూసి పోలీసులు కూడా షాక్​ అవుతున్నారు. ఇంత వరకు తమ సర్వీస్​లో ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. ఇంతకీ ఆ దొంగతనం ఎలా జరిగింది?

indore thief news
మధ్యప్రదేశ్​లో ఇల్లంతా చోరీ
author img

By

Published : Mar 4, 2022, 9:56 PM IST

indore thief news: మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జరిగిన ఓ దొంగతనం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనికి కారణం వారు దోచుకున్న విధానమే. సాధారణంగా ఎవరైనా దొంగలు ఓ ఇంటికి దొంగతనానికి వెళ్తే ముందుగా దొచుకునేది బంగారం, వెండి దీనితో పాటు దొరికిన కాడికి నగదు. కానీ ఈ దొంగలు మాత్రం మరో అడుగు ముందుకు వేసిన ఏకంగా ఇంటిని క్లీన్​ స్వీప్​ చేశారు.

వారు దొంగతనానికి వెళ్లిన ఇంటిలో ఉండే నగలతో పాటు వెండి వస్తువులను, నగదును, రూపాయి నాణాలను కూడా వదలకుండా దోచుకున్నారు. అంతటితో ఆగకుండా దేవుడి గదిలో ఉండే గణగణ కొట్టే గంట నుంచి భోజనం చేసే డైనింగ్​ టేబుల్​పై ఉండే స్పూన్​ వరకు ఏదీ వదలకుండా స్వాహా చేశారు.

ఇవి కూడా చాలవు అని అనుకున్నారు ఏమో కానీ... వంటిట్లో ఉండే రేషన్​ బియ్యం, అవి వండే మట్టి కుండలు, చిన్న చిన్న ప్లేట్లు, మహిళలు వేసుకునే బట్టలు, లో దుస్తులతో సహా అన్నింటినీ క్లీన్​స్వీప్​ చేశారు. ఈ దొంగలు చేసిన చోరీ గురించి తెలిసిన పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి దొంగతనాన్ని తన 24 ఏళ్ల సర్వీసులో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదని అంటున్నారు స్థానికి పోలీస్​ స్టేషన్​ ఆఫీసర్​ రఘువంశీ.

ఈ దొంగతనంలో కనీసం ముగ్గురు నుంచి నలుగురు భాగం అయ్యి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. వారిని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: సైక్లింగ్​ చేస్తూ చెట్టును ఢీకొట్టి.. వైద్య విద్యార్థిని దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.