ETV Bharat / bharat

'బంగాల్​లో భాజపా గాలి- 200+ సీట్లు మావే' - narendra modi

బంగాల్​లో ఘనవిజయం సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజపా గాలి వీస్తోందని, 200కుపైగా స్థానాలను దక్కించుకుంటామని జయనగర్​లో నిర్వహించిన​ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. మమత సర్కార్​పై విమర్శలు గుప్పించారు.

There's BJP wave in Bengal, we'll get more than 200 seats: PM Modi
'బంగాల్​లో భాజపా గాలి- 200పైగా సీట్లు మాకే'
author img

By

Published : Apr 1, 2021, 4:06 PM IST

బంగాల్​లో భాజపా 200కుపైగా సీట్లు దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఎక్కడైనా భాజపానే ఉందని అన్నారు. ఈ సందర్భంగా.. మమత సర్కార్​పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే.. ఆమె ఇతర పార్టీ నేతల మద్దతు, సాయం కోరుతున్నారని అన్నారు.

''కొన్నివారాల క్రితం భాజపా 200 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని బంగాల్​ ప్రజలు చెప్పారు. భాజపా బలంగా తయారైంది. తొలిదశలో ఓటింగ్​ను చూస్తేనే ఇది స్పష్టమైంది. బంగాల్​లో భాజపా 200 కంటే ఎక్కువే గెలుస్తుంది.''

- నరేంద్ర మోదీ, ప్రధాని

రెండో దశలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివెళ్లారని.. బంగాల్​లో భాజపా గాలి వీస్తోందని ఉద్ఘాటించారు మోదీ. తృణమూల్​ కాంగ్రెస్​కు కాషాయంతో, తిలకంతో సమస్య ఉందని అన్నారు మోదీ.

''జైశ్రీరాం నినాదంతో మమతా దీదీకి సమస్య ఉంది. బంగాల్ మొత్తానికి ఈ సంగతి తెలుసు. దుర్గామాత నిమజ్జనంపైనా ఇబ్బంది ఉంది. ఇది కూడా అందరికీ తెలుసు. దీదీకి ఇప్పుడు తిలకం, కాషాయ వస్త్రంతోనూ సమస్య వచ్చినట్లుంది. పిలక ఉన్నవారిని దీదీ అనుచరులు రాక్షసులుగా పిలుస్తున్నారు.''

- నరేంద్ర మోదీ, ప్రధాని

ఇదీ చదవండి: ఫిర్యాదుల్ని పట్టించుకోరేం.. కోర్టుకెళ్తాం: మమత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.