పంజాబ్‌లోని వెట్టి కార్మికుల దుస్థితిపై తాము రాసిన లేఖకు, రైతు ఉద్యమానికి ముడిపెడుతూ వచ్చిన కథనాలను కేంద్ర హోం శాఖ ఖండించింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌కు చెందిన 58 మంది మానసిక వికలాంగులు పంజాబ్‌లో వెట్టి చాకిరీ చేస్తున్నట్టు బీఎస్‌ఎఫ్ గుర్తించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర హోం శాఖ.. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.
అయితే రైతులకు, ఉద్యమానికి అప్రతిష్ఠ కలిగించేందుకే ఈ లేఖ రాసినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. సాధారణ పరిపాలన వ్యవహారాల్లో భాగంగానే లేఖ రాశామని, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని హోం శాఖ అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: బంగాల్ క్షేత్రంలో స్థానిక, స్థానికేతర పోరు