ETV Bharat / bharat

'బంగాల్​లో తృణమూల్​కు ప్రత్యామ్నాయం లేదు' - trinamool congress

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తృణమూల్​కు మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. బంగారు భారత్​ను నాశనం చేసిన భాజపా ఇప్పుడు బంగారు బంగాల్​ గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు.

congress, mamata
'బంగాల్​లో మాకు ప్రత్యామ్నాయం లేదు'
author img

By

Published : Feb 4, 2021, 11:51 PM IST

బంగాల్​లో తృణమూల్​కు మరో ప్రత్యామ్నాయం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఇతర పార్టీలు తమ పార్టీ స్థానాన్ని భర్తీ చేయలేవని వ్యాఖ్యానించారు. తృణమూల్​ ఎస్సీ, ఎస్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్టానికి తృణమూల్ ప్రపంచంలోనే అత్యంత స్నేహపూర్వక పాలన అందించిందన్నారు.

దేశాన్ని అమ్మేశారు..

భాజపాపై దీదీ ధ్వజమెత్తారు. బంగారు భారత్​ను నాశనం చేసిన భాజపా ఇప్పుడు బంగారు బంగాల్​ను తీర్చిదిద్దుతామని చెబుతోందని ఎద్దేవా చేశారు. భాజపా.. దేశాన్ని అమ్మేసిందని ఆరోపించిన దీదీ, బంగాల్​ ఎన్నికలలో పాల్గొనే ముందు వారి పార్టీ సంగతి చూసుకోవాలన్నారు. అంపన్​ తుపాను సాయంపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు హాని తలపెట్టే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి : మహారాష్ట్ర స్పీకర్​ రాజీనామా.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.