Theft In Akhilesh Yadav Convoy In Uttarpradesh : రాజకీయ పార్టీ శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చిన కార్యకర్తలపై.. కొందరు దొంగలు చేతివాటం చూపించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్‌లో వచ్చి.. కార్యకర్తల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, పర్సులు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
రెండు రోజులపాటు జరిగే ప్రజా చైతన్య శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బాందాలోని సర్క్యూట్ హౌస్‌కు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. ఆయన కారు దిగగానే కార్యకర్తలందరూ స్వాగతం పలికి కలవడానికి గుమిగూడారు. ఇంతలో ఆ రద్దీ వాతావరణాన్ని అదునుగా భావించిన కొందరు దొంగలు.. అక్కడికి వచ్చిన కార్యకర్తల ఫోన్లు, పర్సులు దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే, అక్కడున్న కొంతమంది కార్యకర్తలకు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఐదుగురిని పట్టుకుని విచారించారు.
అనంతరం వారి వద్ద నుంచి 15 మొబైల్స్, పలు పర్సులు స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్‌లో రెండు లగ్జరీ కార్లలో వచ్చినట్లు తెలిపారు. కార్యకర్తలతో కలిసి అఖిలేశ్‌కు అనుకూలంగా నినాదాలు సైతం చేశారని చెప్పారు. అయితే, కాసేపటికి అనుమానాదాస్పద రీతిలో ప్రవర్తించారని తెలిపారు. నిందితులు వచ్చిన కార్లు కూడా చోరీ చేశారా లేదా వాటిని అద్దెకు తీసుకువచ్చారా అనే కోణంలో ఆరా తీస్తున్నామని చెప్పారు. 2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది.
రూ.8.5 కోట్లు దోచేశారు.. రూ.10కి కక్కుర్తిపడి దొరికేశారు..
Ludhiana Cash Van Robbery : ఇటీవల పంజాబ్‌లో ఓ జంట భారీ దొంగతనం చేసి పట్టుబడింది. సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగుకాల్వలో పడిపోయినట్లు.. దాదాపు రూ.8.5 కోట్ల సొమ్మును దోచుకొని.. రూ.10 కూల్‌డ్రింక్ కోసం కక్కుర్తిపడి దొరికిపోయారు. వీరెందుకు ఇలా చేశారో? ఎక్కడి నుంచి రూ.8.5 కోట్ల డబ్బును చోరీ చేశారో? తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి స్టోరీ చదివేయండి.
వీడు మామూలు దొంగ కాదు బాబోయ్.. జేబుకే తెలియకుండా ఫోన్ కొట్టేశాడు