ETV Bharat / bharat

96 మందికి కొత్త రకం కరోనా - భారత్​లో యూకే కొత్తరకం కరోనా కేసులు

దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్​లో ఇప్పటివరకు 96 మంది యూకే వైరస్ బారిన పడ్డారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం వారిని ప్రత్యేక ఐసోలేషన్​లో ఉంచినట్లు పేర్కొంది.

The total number of persons found infected with the mutant UK strain of COVID-19 is 96.
దేశవ్యాప్తంగా 96మందికి కొత్తరకం కరోనా
author img

By

Published : Jan 11, 2021, 2:32 PM IST

దేశవ్యాప్తంగా యూకే రకం కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశంలో 96 కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వైరస్​ బాధితులందరినీ ప్రత్యేకమైన ఐసోలేషన్​ రూంలో ఉంచినట్లు తెలిపింది. వారి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులు, బంధువులను గుర్తించి క్వారంటైన్​కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

యూకేకు చెందిన కొత్త రకం కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. డెన్మార్క్, నెథర్లాండ్స్​, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్​ల్యాండ్​, జర్మనీ, కెనడా, జపాన్​, లెబనాన్, సింగపుర్ దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి : 'కొత్త' కరోనాను గుర్తించేందుకు 'జినోమిక్స్ కన్సార్టియం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.