ETV Bharat / bharat

మహిళలపై రిక్షా డ్రైవర్​ పెట్రోల్​ దాడి.. పరిస్థితి విషమం - నాసిక్​లో పెట్రోల్​ దాడి

మహారాష్ట్ర నాశిక్​లో దారుణం జరిగింది. ఓ రిక్షా డ్రైవర్ ఇద్దరు మహిళలపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మహిళల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ​

rickshaw driver threw petrol and set fire to two women
మహిళలపై పెట్రోల్​ దాడి
author img

By

Published : Aug 11, 2021, 12:24 PM IST

మహారాష్ట్రలోని నాశిక్​లో ఇద్దరు మహిళలపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు సుఖ్​దేవ్​ గులాబ్​ మెచేవాల్​ అనే రిక్షాడ్రైవర్​. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు చిన్నారులు సహా ఓ వ్యక్తి ఈ ఘటన నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. బాధితులు ఇంట్లో ఉన్న సమయంలో ఇది జరిగింది. మంటలకు ఇంట్లో ఉండే సామాగ్రి అంతా పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయంపై పంచవటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

rickshaw driver threw petrol and set fire to two women
పెట్రోల్​ దాడిలో కాలిపోయిన సామాగ్రి

దాడిలో దగ్ధమైన టీవీ

ఇదీ జరిగింది..

ప్రదీప్​ ఓం ప్రకాశ్​ గౌడ్​ అనే వ్యక్తి నాశిక్​ షిండే నగర్​లో నివాసం ఉండేవారు. ఆయన అత్త భారతీ గౌడ మంగళవారం ఇంటికి వచ్చారు. అయితే మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ప్రదీప్​కు పరిచయం ఉన్న సుఖ్​దేవ్​.. ఇంటికి వచ్చి భారతీ గౌడ్​ను నోటికి వచ్చినట్లు తిడుతూ, కొట్టసాగాడు. ఈ క్రమంలోనే తాను తెచ్చిన రెండు బాటిళ్ల పెట్రోల్​ను ఇంట్లో ఉన్న భారతి గౌడ్ అమె సోదరి సుశీలపై విసిరాడు. దీంతో వారి శరీరానికి మంటలు అంటుకున్నాయి. ఇల్లంతా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనను పోలీసులకు వివరిస్తున్న కుటుంబ సభ్యుడు

ఇదీ చూడండి: పొలాల్లో కుప్పకూలిన వాయుసేన డ్రోన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.