ETV Bharat / bharat

'కొద్దిరోజులు కలిసుంటే సహజీవనం కాదు- ప్రేమజంటకు రూ.25వేలు ఫైన్' - High Court on Live in relation

Live in relationship: సహజీవనంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది. తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలి పిటిషన్ దాఖలు చేసిన ఓ ప్రేమజంటకు రూ.25వేల జరిమానా విధించింది.

live-in relationship
సహజీవనం
author img

By

Published : Dec 16, 2021, 5:18 PM IST

Live in relationship: సహజీవనం చేస్తున్న ఓ ప్రేమజంటకు షాక్ ఇచ్చింది పంజాబ్​ హరియాణా హైకోర్టు. ఇద్దరు యువతీయువకులు కొద్దిరోజులు కలిసి జీవించినంత మాత్రాన సహజీవనం అని చెప్పలేమని పేర్కొంది. పెద్దల నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. పిటిషన్ దాఖలు చేసిన లవర్స్​కు రూ.25వేల జరిమానా విధించింది.

High Court on Live in relation

హరియాణా యమునానగర్​కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి తరఫున ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరూ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని, కానీ అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోవడం లేదని తెలిపారు. అబ్బాయికి పెళ్లి ఈడు వచ్చే వరకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. నవంబర్​ 24నుంచి ఇద్దరూ ఓ హోటల్ గదిలో ఉంటున్నట్లు కోర్టుకు చెప్పారు. నవంబర్​ 26న ఈ పిటిషన్​ను పరిశీలించిన న్యాయస్థానం దీన్ని తిరస్కరించింది. కొద్ది రోజులు ఓకే గదిలో ఉండి సహజీవనం అని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా రూ.25వేల జరిమానా విధించింది.

Punjab and Haryana High Court news

అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టాలని వారు చూస్తున్నారని పిటిషన్​లో అబ్బాయి ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవని కోర్టు చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులపై పోలీస్​ స్టేషన్​లో కూడా కేసు నమోదు చేయలేదని గుర్తు చేసింది.

Couple living together

" సమాజం, సామాజిక విలువల్లో గత కొంత కాలంగా చాలా మార్పు వచ్చింది. ప్రత్యేకించి యువత సంపూర్ణ స్వేచ్ఛ కావాలని భావించి తల్లిదండ్రుల నుంచి విడిపోతున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవిస్తున్నారు. అంతేగాక తమ స్వేచ్ఛకు, ప్రాణాలకు హాని ఉందని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సహాజీవనం భారత్​లో కూడా బాగానే గుర్తింపు పొందింది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటివి తప్పేం కాదని చట్టాలు కూడా చెబుతున్నాయి. అయితే సమాజంలోని కొన్ని వర్గాలు ఇలాంటి సంబంధాలను అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు అనుబంధాన్ని స్థిరంగా కొనసాగిస్తేనే అది వైవాహిక సంబంధానికి దారితీస్తుందని నిరంతరం గుర్తుంచుకోవాలి"

-పంజాబ్​ హరియాణా హైకోర్టు

ఇదీ చదవండి: Marriage Age: అమ్మాయిల కనీస వివాహ వయసు.. 21ఏళ్లకు పెంపు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.