దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమానికి కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ వినోద్ పాల్ సహా తదితరులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి.
దేశంలో కొత్తగా 93,249 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ సోకినవారిలో మరో 513 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:వీఎస్ లేమితో కళ తప్పిన వామపక్షాల ప్రచారం!