ETV Bharat / bharat

వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం- ఇవి గుర్తుంచుకోండి - కొవాగ్జిన్ వార్తలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా శనివారం టీకా పంపిణీ ప్రారంభం కానుంది. 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించే నియమ నిబంధనలపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

The plan for vaccine roll out in India
వ్యాక్సినేషన్​.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా?
author img

By

Published : Jan 15, 2021, 5:29 PM IST

వ్యాక్సినేషన్​.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న దేశం ఊపిరి పీల్చుకోనుంది. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు భారత్ సిద్ధమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

  • పంపిణీ కేంద్రాలు: 3006
  • ఎంతమందికి: 3 లక్షల మంది
  • సందేహాల కోసం: 1075 టోల్‌ ఫ్రీ నెంబరు

ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించే నియమ నిబంధనలు, చేయాల్సినవి.. చేయకూడనివి చెబుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని, గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొంది.

ఇవి గుర్తుంచుకోవాలి..

  • కొవిడ్‌ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి.
  • యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్‌ టీకా ఇవ్వాలి.
  • గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్‌ టీకా క్లినికల్‌ పరీక్షలు జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు.
  • కచ్చితంగా 18ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్‌ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.
  • టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
  • టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్‌ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది.

తొలి దశలో ఎవరికి?

  1. ఫ్రంట్​లైన్ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్​ కార్యకర్తలు
  2. నర్సులు, సూపర్​వైజర్లు
  3. వైద్య అధికారులు
  4. పారామెడికల్​ సిబ్బంది
  5. సహాయక సిబ్బంది
  6. వైద్య విద్యార్థులు

రెండోదశలో..

  • ఫ్రంట్​లైన్​ వర్కర్లు
  • మున్సిపల్​ కార్మికులు

మూడోదశలో..

  1. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు
  2. ఇతర వ్యాధులు ఉన్న 50 ఏళ్లలోపు వారికి

టీకా కోసం రిజిస్టర్​ చేశారా?

  1. కొ-విన్​ వెబ్​సైట్​లో సొంతంగా పేరు నమోదు చేసుకోవాలి.
  2. ఫొటో ఐడీ అప్​లోడ్ చేయాలి.
  3. ఆధార్​ కార్డు వివరాల ద్వారా కొ-విన్​లో ఆధార్​ అథెంటికేషన్​ చేసుకోవచ్చు.
  4. జాబితాను అనుసరించి టీకా అందించే తేదీ, సమయాన్ని వెల్లడిస్తారు.
  5. రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారికే టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తారు.
  6. కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్​ సౌలభ్యం లేదు.

టీకా ఎక్కడ లభిస్తుంది?

  • నియమిత ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కేంద్రాలు
  • ఔట్​రీచ్​ కేంద్రాలు
  • సుదూర ప్రాంత ప్రజలు, అంతర్జాతీయ సరిహద్దులో నివసించే వారికోసం ప్రత్యేక మొబైల్ టీమ్​ల ద్వారా టీకా పంపిణీ

వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఇలా..

  1. టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లడం
  2. గుర్తింపు పత్రాల ధ్రువీకరణ
  3. టీకా స్వీకరించడం
  4. 30 నిమిషాల పాటు పర్యవేక్షణ
  5. ప్రతికూల ప్రభావాలు లేకుంటే బయటకు వచ్చేయడం

ప్రస్తుతం 1.65 కోట్ల టీకా డోసులను కొనుగోలు చేసింది కేంద్రం. అందులో 1.1 కోట్ల డోసులు కొవిషీల్డ్​, 55 లక్షలు కొవాగ్జిన్​ డోసులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.