ETV Bharat / bharat

సీఎం కానుక- పింఛన్ రూ.200 పెంపు - కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలు

పింఛనుదారులకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్​ను రూ.200 మేర పెంచుతున్నట్లు ప్రకటించారు.

Old Age Pension will be increased
పింఛన్ పెంపు
author img

By

Published : Jul 28, 2021, 5:16 PM IST

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై.. తొలి రోజే ఆ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రూ. 1000గా ఉన్న వృద్ధాప్య పింఛన్​ను రూ. 200 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రూ.600గా ఉన్న వితంతు పింఛన్​ను రూ. 800 చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల పింఛన్​ను మరో రూ. 200 పెంచుతున్నట్లు వెల్లడించారు.

సంధ్యా సురక్ష పథకం కింద పెంచిన వృద్ధాప్య పింఛన్​తో ప్రభుత్వంపై అదనంగా మరో రూ.863.52 కోట్ల భారం పడుతుందని.. దీంతో 35.98 లక్షల మంది లబ్ధిపొందుతారని బొమ్మై తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. నిధులను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు.

ప్రభుత్వ అజెండాను మంత్రివర్గానికి, అధికారులకు వివరించాను. ప్రధానంగా మా ముందున్న సమస్యలు కరోనా, వరదలు. వీటిని సమర్థవంతగా ఎదుర్కోవాలి. అంతేగాకుండా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతకు ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్లతో స్కాలర్​షిప్​ను తీసుకొస్తాము.

-బసవరాజ్​ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

కర్ణాటక నూతన సీఎం రాజకీయ ప్రస్థానమిదే..

కన్నడ పీఠంపై బొమ్మై.. ముగిసిన యడ్డీ రాజకీయ ప్రస్థానం!

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.