కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌పై ప్రజలు ఆందోళనకు గురికావద్దని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ సూచించారు. ఇది ప్రాణాంతకం కాదని, దీని వల్ల మరణాల రేటు కూడా పెరిగే అవకాశం లేదని చెప్పారు. అయితే ఈ రకం కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని స్పష్టం చేశారు.
కొత్త రకం కరోనా కేసులు భారత్‌లో ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని పాల్ వెల్లడించారు. దేశంలో అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సమర్థతపై దీని ప్రభావం ఉండబోదని తెలిపారు. కొత్త రకం స్ట్రెయిన్‌పై ఇప్పటివరకు అందిన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఈ మేరకు అవగాహనకు వచ్చినట్లు వివరించారు. అయితే వైరస్‌ను నియంత్రించే వరకు దానిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రకం వైరస్ కారణంగా తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యే ప్రమాదం లేదని పాల్ చెప్పారు.