దేశ రాజధాని దిల్లీలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. దిల్లీలో ఇంకా కరోనా ఉద్ధృతి తగ్గలేదన్నారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణకు పోర్టల్ ప్రారంభించామన్న కేజ్రీవాల్.. ప్రతి 2 గంటలకు పోర్టల్‌లో ఆక్సిజన్ వివరాలు అప్‌డేట్ చేస్తున్నట్లు వివరించారు. దిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 32.27 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.
దిల్లీలో కరోనా విజృంభిస్తుంటంతో ఈనెల 19న వారం రోజుల పాటు పూర్థిస్థాయి లాక్‌డౌన్ విధించారు సీఎం కేజ్రీవాల్. అయితే కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి దయనీయ పరిస్థితులు తలెత్తుతుండటం వల్ల దిల్లీ సర్కారు లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించింది.