HC on Lokesh bail petition : నారా లోకేశ్‌కు తాత్కాలిక ఊరట కలిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేశ్ వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... లోకేశ్‌ను వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఇక ఫైబర్‌నెట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 4కు హైకోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ.. ఇటీవలే లోకేశ్ పేరును చేర్చింది. ఈ మేరకు సీఆర్పీసీ (CRPC) 41A ప్రకారం లోకేశ్ కు ముందస్తు నోటీసులు ఇస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలపగా... అరెస్టు గురించి ఆందోళన లేనందున ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. స్కిల్ కేసులో ఈ నెల 4వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఫైబర్‌నెట్ కేసుకు సంబంధించిన విచారణ వచ్చే నెల 4న విచారించనుంది.