అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధాన్ని(Flight Ban India) మరోసారి పొడిగించింది కేంద్రం. సెప్టెంబరు 30 వరకు కమర్షియల్ ప్యాసెంజర్ విమానాలపై ఆంక్షలు అమలులో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే డీజీసీఏ(DGCA) అనుతిచ్చిన కార్గో విమాన సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో అధికారులు అనుమతి ఉన్న అంతర్జాతీయ విమానాలతు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం.

కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం(Flight Ban) విధించింది భారత్. ఇప్పుడు మరోసారి దాన్ని పొడిగించింది.
ఇదీ చూడండి: Corona Update: నాలుగో రోజూ 40వేలకుపైగా కేసులు