ETV Bharat / bharat

'కూతురిపై అత్యాచారం'.. రెండేళ్ల జైలుశిక్ష తర్వాత నిర్దోషిగా తండ్రి - తండ్రి కేసు కన్న కూతురు

తనపై అత్యాచారం చేశాడని కుమార్తె చేసిన ఆరోపణలు.. నిర్దోషి అయిన తండ్రిని రెండేళ్ల పాటు జైలుపాలు చేశాయి. ఎటువంటి ఆధారాలు లేకుండానే పోలీసులతో అతడ్ని అరెస్ట్​ చేయగా.. నిందితుడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్టులోనే విలపించాడు బాధితుడు. తాను కోల్పోయిన పరువు, గౌరవం తిరిగి వస్తాయా? అంటూ రోదించాడు.

The father has been innocent declared by the court after 2 years in his own daughter's rape case

author img

By

Published : Jul 6, 2022, 9:31 AM IST

దేశ న్యాయవ్యవస్థలో లోపం, పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపే మరో ఘటన గుజరాత్​లో జరిగింది. కన్న కూతురు చేసిన అత్యాచార ఆరోపణలపై జైలు జీవితం అనుభవించిన ఓ వ్యక్తిని.. రెండేళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. అతడు దోషి అని నిరూపించేలా పోలీసులు తగిన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయారు. కోర్టు నుంచి విడుదలయ్యాక సమాజంలో తాను కోల్పోయిన మర్యాద, గౌరవం తిరిగి వస్తాయా అంటూ అతడు విలపించాడు.

The father has been innocent declared by the court after 2 years in his own daughter's rape case
నిర్దోషిగా విడుదలైన బలరామ్​

ఇదీ జరిగింది.. ఉత్తర్​ప్రదేశ్‌కు చెందిన బలరామ్ విశ్వంభర్​.. వారణాసిలో చదవుకున్నాడు. అనంతరం 2003లో గుజరాత్​.. వల్సాద్ జిల్లాలోని పార్డిలో హిందీ-సంస్కృత ఉపాధ్యాయునిగా చేరాడు. 2020 జులై 8న అతడి కుమారై 1098కి కాల్ చేసి తనపై తండ్రి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపించింది. 1098 హెల్ప్‌లైన్ వల్సాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సోనాల్ సోలంకితో పాటు అతడి బృందం బలరామ్​ ఇంటికి చేరుకుంది. అతడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదును విచారించకుండానే.. పార్డి పోలీస్ స్టేషన్‌లో శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బలరామ్​ కుమార్తెను ధరసనా చిల్డ్రన్స్ హోంకు పంపించారు.

కోర్టు ప్రాంగణంలోనే పడుకున్న బలరామ్​

వెంటనే బలరామ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిజనిజాలు తెలుసుకోకుండానే దారుణంగా ప్రవర్తించారు. లాఠీ దెబ్బలు కూడా కొట్టారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అక్కడ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన బలరామ్​.. చివరకు నిర్దోషిగా విడుదలయ్యాడు. నిర్దోషిగా తేలిన తరువాత.. బలరామ్​ కోర్టు ప్రాంగణంలో పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. తన పరువు మొత్తం తీశారని వాపోయాడు.

"రెండేళ్లు శారీరకంగా, మానసికంగా నరకం అనుభవించాను. జైలులో ఇతర ఖైదీలు నన్ను గేలి చేసేవారు. నా కుటుంబం పరువు పోయింది. సమాజంలో మా కుటుంబ గౌరవం మంటలో కలిసిపోయింది. ఇప్పుడు నేను నిర్దోషిగా విడుదలయ్యాను. కానీ ఆ గౌరవాన్ని తిరిగి నేను పొందగలనా?.. సమాజం నన్ను నిర్దోషిగా గుర్తిస్తుందా?" అని కోర్టు ముందు బలరామ్​ కన్నీరు పెట్టుకున్నాడు.

ఇవీ చదవండి: ముదురుతున్న 'కాళీ' పోస్టర్​ వివాదం.. డైరెక్టర్​, ప్రొడ్యూసర్​పై కేసు

యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతురు.. వైమానిక దళ చరిత్రలోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.