ETV Bharat / bharat

Independence Day: మహోజ్జ్వల వేళ విభజన హోమం! - సరిహద్దు గొడవలు

1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా తమపై పోరాడటం చూసి బ్రిటిష్ వారు హడలుకున్నారు. భారతీయులు కుల, మత భేదాలు లేకుండా ఒక్కటైతే తమ పాలనకు గోరీ కట్టేస్తారని వారికి అర్థమైపోయింది. అందుకే వారి మనసుల్లో అనైక్యతా విష బీజాలను నాటారు. ఇది దారుణ మారణహోమానికి దారితీసింది.

scalating-tensions-between-hindus-and-muslims
మహోజ్జ్వల వేళ విభజన హోమం
author img

By

Published : Aug 15, 2021, 10:48 AM IST

భారత స్వాతంత్ర్య సమరం మానవాళి చరిత్రలోనే మహోన్నత ఘట్టం. ఆ సమర ఫలమే స్వతంత్ర భారత ఆవిర్భావం. కానీ, భారతదేశం సమైక్యంగా విరాజిల్లడం కుత్సిత వలస పాలకులకు ఏమాత్రం సమ్మతం కాదు కనుకనే పోతూపోతూ దేశాన్ని అడ్డదిడ్డంగా విభజించి పోయారు. అంతకుముందు నుంచి బ్రిటిష్ వారు హిందూ, ముస్లింల మధ్య పెంచిపోషించిన వైషమ్యాలు విభజన సమయంలో ఒక్క పెట్టున ప్రజ్వరిల్లి దారుణ మారణహోమానికి దారితీశాయి.

partition line
రక్తసిక్తంగా దేశవిభజన

1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో హిందువులు, ముస్లింలు కలసికట్టుగా తమపై పోరాడటం చూసి బ్రిటిష్ వారు హడలుకున్నారు. భారతీయులు కుల, మత భేదాలు లేకుండా ఒక్కటైతే తమ పాలనకు గోరీ కట్టేస్తారని వారికి అర్థమైపోయింది. అందుకే వారి మనసుల్లో అనైక్యతా విష బీజాలను నాటారు.

  • స్వాతంత్య్రానికి ముందు నుంచే ముస్లింలీగ్​ను బలోపేతం చేసి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసే స్థాయికి దాన్ని పెంచారు. తద్వారా దేశ విభజనను అనివార్యం చేశారు. నిజానికి ముందాలోచనతో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే, దేశ విభజన అంత రక్తసిక్తంగా మారేది కాదు.
  • విభజన రక్తపాతానికి దారితీస్తుందనడానికి ముందే సంకేతాలు వచ్చాయి. స్వాతంత్ర్యానికి ముందే.. 1946 ఆగస్టు 16న కోల్​కతాలో మూడు రోజులపాటు రేగిన హింసాకాండలో 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షమంది నిరాశ్రయులయ్యారు. దీన్ని గుర్తుంచుకునైనా 1947 దేశ విభజన సందర్భంలో జాగ్రత్తపడి ఉండాల్సింది.

భారత్​లో తమ వలస పాలన దుకాణం ఎత్తేయడానికి బ్రిటన్ నియమించిన చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్​బాటన్ అంతా కంగాళీ చేసి పెట్టారు. 1947 ఫిబ్రవరిలో భారత్​లో దిగిన మౌంట్​బాటన్​కు భారత్, పాకిస్థాన్​లను వేరు చేసి స్వాతంత్ర్యం ప్రకటించడానికి 1948 జూన్ వరకు గడువు ఉంది. అయినా, ఆదరా బాదరాగా క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకుండానే పది నెలలు ముందే అధికారం అప్పజెప్పారు. ఆయన బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా విధులు నిర్వహించి ఉంటే అపార రక్తపాతం, ప్రజల హాహాకారాలు తప్పేవి.

ఇదీ చదవండి: భారత సైన్యం చరిత్రలోనే కార్గిల్​ యుద్ధం ఓ మైలురాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.