ETV Bharat / bharat

పుదుచ్చేరి బరి: యానాం సీటు వదిలి కాంగ్రెస్ త్యాగం!

author img

By

Published : Mar 20, 2021, 7:06 PM IST

పేరుకు చిన్న ప్రాంతం. తిరుగుతున్న రాజకీయ మలుపులు మాత్రం అనేకం. రెండు నెలలుగా పుదుచ్చేరిలో ఇదే పరిస్ధితి. శాసనసభ ఎన్నికల వేళ ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుదుచ్చేరి వర్తమాన రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన మల్లాది కృష్ణారావు తాను పోటీ చేసే యానాం సీటును త్యాగం చేశారు. ఏఐఎన్​ఆర్​సీ అధినేత రంగస్వామి కోసం యానాం సీటును వదులుకున్నారు. సుదీర్ఘ కాలంగా యానాం అంటే మల్లాది కృష్ణారావు అన్నట్లుగా మారిన ఇక్కడి రాజకీయాలు.. ఆయన పోటీ నుంచి పక్కకు జరగగా ఆసక్తిగా మారాయి.

The curious case of Yanam: Congress skips naming candidate for constituency
పుదుచ్చేరి బరి: యానాంలో ​కాంగ్రెస్​ ఆచితూచి!

మల్లాది కృష్ణారావు.. పుదుచ్చేరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయ తెర మీద ప్రముఖంగా కనిపించే పేరు. యానాం సీటు నుంచి నాలుగు సార్లు గెలిచిన ఈయన ఇటీవల కూలిపోయిన నారాయణ స్వామి మంత్రివర్గంలో కీలక మంత్రి కూడా. మంత్రివర్గానికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. యానాం సీటులో ఏ పార్టీ తరఫున బరిలో దిగుతారో అని ఉత్కంఠ నెలకొని ఉండగా, ఇప్పుడు ఆయన దానికి తెరదించారు.

ఏకంగా తాను పోటీ చేయబోవడం లేదని మల్లాది కృష్ణారావు తెలిపారు. ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్​సీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. యానాంలో బరిలోకి దిగిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం రంగస్వామికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ కాలం శాసనసభ్యుడుగా ఉన్న మల్లాది కృష్ణారావు పోటీలో లేకపోవడం యానాంలో పోటీ ఆసక్తికరంగా మారింది.

సందేహంలో కాంగ్రెస్​!

అటు, యానాంలో కాంగ్రెస్‌ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. ఈ స్థానంలో మల్లాది కృష్ణారావుకు గట్టి పట్టు ఉండడం, ఆయన మరో బలమైన నేత రంగస్వామికి మద్దతు ఇస్తుండడం వల్ల కాంగ్రెస్‌ గెలుపుపై సందేహంతో ఉంది. ఈ పరిస్ధితుల్లో యానాంలో అభ్యర్థిని నిలబెట్టడం వృథా అని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ రంగస్వామి గెలుపును ఆపలేమన్న భావన.. కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

యానాం స్థానానికి మల్లాది కృష్ణారావు 1996 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యానాంలో రంగస్వామి నామినేషన్‌ వేయకముందు నుంచే మల్లాది కృష్ణారావు ప్రచారం ప్రారంభించారు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో వచ్చే ఎన్నికల్లో ఏఐఎన్​ఆర్​సీ ఘన విజయం సాధించి, రంగస్వామి పుదుచ్చేరీ సీఎం అవుతారని కృష్ణా రావు ధీమా వ్యక్తం చేశారు. యానాంతో పాటు తట్టన్‌ చావడీ నుంచి కూడా ఎన్​.రంగస్వామి బరిలో ఉన్నారు.

ఇంకా స్పష్టతనివ్వడం లేదు..

ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా.. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ 15 స్థానాల్లో, డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయాలని భావించాయి. మిగతా 2 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించారు. ఇందులో భాగంగా.. 14 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌, నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్నప్పటికీ.. యానాంలో పోటీపై స్పష్టతనివ్వడం లేదు.

కాంగ్రెస్‌కు పుదుచ్చేరి కంచుకోట అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. ఈ సారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కీలక నేతలు, మంత్రులు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌ పునరాలోచనలో పడింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే.. తప్పనిసరిగా గెలిచే స్థానాల్లోనే అభ్యర్థులను బరిలో ఉంచింది. ఏప్రిల్‌ 6న పుదుచ్చేరీలో జరిగే ఎన్నికలు కాంగ్రెస్‌కు లిట్మస్‌ పరీక్ష లాంటిదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఇవీ చూడండి:

అసోం, పుదుచ్చేరి ఎన్నికలకు కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే అభ్యర్థులు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.