దేశంలో రెండో దశ వైరస్ వ్యాప్తితో నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ఆన్‌లైన్ విధానంలో జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయం అందించాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ప్రధాని.. స్థానికంగా ఉండే సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
బలహీన వర్గాల వారికి ఉచిత ఆహార ధాన్యాలు అందించడం సహా.. జన్‌ధన్ ఖాతాదారులకు ఆర్థిక సహాయం గురించి కూడా సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 కోట్ల టీకాలను ప్రజలకు అందించినట్లు ప్రధాని తెలిపారు.
ఇదీ చూడండి: 'కేంద్రం, రాష్ట్రాల వ్యాక్సిన్ ధరల్లో తేడాలెందుకు?'