ETV Bharat / bharat

'థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తా'

author img

By

Published : Jan 8, 2021, 9:18 PM IST

Updated : Jan 9, 2021, 5:23 AM IST

థియేటర్లలో ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచేందుకు అనుమతిస్తానని తెలిపారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేంద్రం ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Mamata Banerjee on 100 percent seating in theaters
'థియేటర్లలో 100 శాతం ఆక్సుపెన్సీకి అనుమతిస్తా'

థియేటర్లు, మల్టీప్లెక్స్​లలో సీటింగ్​ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు పశ్చిమ్​ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . 26వ కోల్​కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​కు హాజరైన మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినిమా హాళ్లలో కేవలం 50 శాతం మందికే అనుమతి ఉండేది. ఈ తరుణంలో బంగాల్​ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి షో అనంతరం హాల్​ను శానిటైజ్​ చేయాలని మమత తెలిపారు.

ఈ ఫిల్మ్​ ఫెస్టివల్​కు బాలీవుడ్ నటుడు షారుఖ్​ ఖాన్ వర్చువల్​గా హాజరయ్యారు.

ఇదీ చదవండి:థియేటర్ల విషయంలో తమిళనాడుకు కేంద్రం షాక్

Last Updated : Jan 9, 2021, 5:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.