ETV Bharat / bharat

22 కుక్కలు ఉన్న గదిలో బాలుడు బందీ.. రెండేళ్లుగా నరకం - బాలుడు కుక్కలు గది

Boy Kept Room With 22 Dogs: 22 కుక్కలు ఉన్న ఓ గదిలో రెండేళ్లుగా 11 ఏళ్ల బాలుడిని బంధించిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆ చిన్నారికు విముక్తి కల్పించి.. అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Boy Kept Room With 22 Dogs:
Boy Kept Room With 22 Dogs:
author img

By

Published : May 12, 2022, 6:54 AM IST

Boy Kept Room With 22 Dogs: మహారాష్ట్రలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణెలోని ఓ భార్యాభర్తలు తమ 11 ఏళ్ల కుమారుడిని.. 22 కంటే ఎక్కువ కుక్కలు ఉన్న గదిలో రెండేళ్లుగా బంధించి దారుణంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. కుక్కలు ఉన్న ఆ గది నుంచి ఆ పిల్లాడికి విముక్తి కల్పించారు.

షాక్​ అయిన అధికారులు.. సంజయ్ లోధారియా, శీతల్ లోధారియా దంపతులు కోంధ్వాలో కృష్ణై భవనంలో నివసిస్తున్నారు. వీరి ఇంట్లో 20 నుంచి 22 కుక్కలు ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా వారి కుమారుడు కుక్కలు ఉన్న గదికే పరిమితమయ్యాడు. రానురాను ఆ బాలుడు కూడా గది కిటికీ వద్ద కూర్చుని కుక్కలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ అపర్ణ మోదక్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు షాకయ్యారు. బాలుడు ఆ సమయంలో కుక్కలు ఉన్న గదిలోనే ఉన్నాడు. అతడి చుట్టూ 20 నుండి 22 కుక్కలు కనిపించాయి. దీంతో కోంధ్వా పోలీస్ స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేశారు.

22 కుక్కలు ఉన్న గదిలో బాలుడు బందీ

పోలీసు అధికారుల స్పందన.. బాలుడి తల్లిదండ్రులుపై జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ&రక్షణ) చట్టం- 2000లోని సెక్షన్లు 23, 28 కింద కేసులు నమోదు చేశారు. విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సర్దార్ పాటిల్.. బాలుడిని రక్షించిన అనుభవాన్ని వివరించారు. 'బాధిత చిన్నారిని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురావడం నిజంగా కష్టమైన పని, ఎందుకంటే ఆ కుక్కలను చూస్తే భయం వేసింది' అని ఆయన చెప్పారు. అలాంటి అపరిశుభ్రమైన ప్రదేశంలో 22 కుక్కల దగ్గర 11 ఏళ్ల బాలుడిని బంధించడం బాధాకరమన్నారు.

ఇవీ చదవండి: వేల అడుగులు ఎత్తయిన కొండపై ట్రాక్టర్​ స్టంట్స్​.. వీడియో వైరల్​

ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.