ETV Bharat / bharat

చైనా వంతెన నిర్మాణంపై భారత్ స్పందన.. ఏమందంటే? - congress on china bridge in ladakh

MEA on China bridge: వాస్తవాధీన రేఖ సమీపంలోని పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మాణంపై భారత్ స్పందించింది. ఇది సైనికపరమైన అంశమని, రక్షణ శాఖ దీనిపై వివరంగా స్పందిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. వివాదాస్పద అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది.

China bridge india responce
China bridge india responce
author img

By

Published : May 20, 2022, 4:52 AM IST

India China bridge Pangong lake: తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్‌ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన ఆ దేశ ఆక్రమిత ప్రాంతంలో ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడ చాలా సంవత్సరాలుగా చైనా నిర్మాణాలు చేస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. అది సైనికపరమైన అంశం అని తెలిపారు. వివాదాస్పద అంశాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయని, అందుకు ప్రయత్నాలు చేస్తుంటామని వివరించారు. ద్వైపాక్షిక, సైనిక మార్గాల్లో చర్చలు జరుగుతాయని అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

China bridge india responce
చైనా వంతెన నిర్మిస్తున్న ప్రాంతం.. ఉపగ్రహ చిత్రం

"ఎల్‌ఏసీ అంశంపై భారత్‌, చైనా మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. చైనా విదేశాంగ మంత్రి కూడా భారత్‌ వచ్చారు. ఆయనతో కూడా చర్చలు జరిగాయి. మా ఆకాంక్షలను ఆయన ముందు ఉంచాం. చర్చలను ముందుకు తీసుకువెళతాం. చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. చైనా వంతెన నిర్మాణంపై వార్త చూశాం. వంతెన ఉన్న ప్రాంతాన్ని చైనా ఆక్రమిత ప్రాంతంగా మేం భావిస్తాం. అది సైనికపరమైన అంశం. దీనిపై మరిన్ని వివరాలు రక్షణ శాఖే ఇవ్వగలదు."
-అరిందమ్ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

Congress on China bridge: కాగా, ప్రభుత్వ స్పందనపై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ ధోరణి పాటిస్తోందని ధ్వజమెత్తింది. నామమాత్రంగా, భయంతో కూడిన స్పందన ఇచ్చిందంటూ విదేశాంగ శాఖపై మండిపడింది. భారత ప్రాదేశిక సమగ్రతను చైనా ఉల్లంఘిస్తూనే ఉందని, మోదీ ప్రభుత్వం మాత్రం భారత భూభాగాన్ని డ్రాగన్​కు అప్పగిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.