ETV Bharat / bharat

భవిష్యత్తులో మరిన్ని వేవ్​లు రావొచ్చు: రాహుల్ - కొవిడ్-19

దేశంలో కరోనా మొదటి, రెండో దశను అడ్డుకోవటంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. కొవిడ్​-19పై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. కొవిడ్ వైరస్ పరివర్తనం చెందుతున్న క్రమంలో భవిష్యత్తులో మరిన్ని వేవ్​లు రావొచ్చన్నారు.

rahul gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Jun 22, 2021, 11:39 AM IST

Updated : Jun 22, 2021, 12:23 PM IST

కొవిడ్​-19పై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శ్వేత పత్రం లక్ష్యం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించటం కాదని.. కరోనా మూడో దశ దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అని తెలిపారు. దేశంలోకి కొవిడ్ థర్డ్ వేవ్ రానుందని ప్రజలకు తెలుసని వివరించారు. దేశంలో కరోనా మొదటి, రెండో దశను అడ్డుకోవటంలో కేంద్రం విఫలమైందన్నారు.

కొవిడ్ వైరస్ పరివర్తనం చెందుతున్న క్రమంలో భవిష్యత్తులో మరిన్ని వేవ్​లు రావొచ్చని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

కేంద్రం చర్యలేవి?

దేశంలో థర్డ్ వేవ్​ రానుందని దేశం మొత్తం తెలుసని.. ఈ క్రమంలో కేంద్రం సమాయత్తం కావాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.

"కొవిడ్​పై ప్రధాన అస్త్రం వ్యాక్సినేషన్ మాత్రమే. 100 శాతం దేశ ప్రజలందరికీ టీకా పంపిణీ చేయాలి. టీకా పంపిణీలో అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా భావించాలి. భాజపా, భాజపాయేతర రాష్ట్రాలుగా పరిగణించవద్దు. దేశంలో ఆక్సిజన్ కొరతతోనే చాలామంది చనిపోయారు. ప్రాణాలు కాపాడేది ఆక్సిజన్.. ప్రధాని కన్నీరు కాదు."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

దేశంలో సోమవారం అత్యధికంగా వ్యాక్సినేషన్ అందించటంపై రాహుల్ హర్షం వ్యక్తంచేశారు. అయితే.. ఏదో ఒకరోజు కాకుండా ప్రతిరోజూ వ్యాక్సినేషన్ జరగాలన్నారు.

ఇదీ చదవండి: మోదీకి బ్యానర్లు కట్టాలని విద్యాసంస్థలకు ఆదేశాలు

Last Updated : Jun 22, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.