ETV Bharat / bharat

రాష్ట్రపతితో గవర్నర్ల సమావేశం- మోదీ హాజరు

గవర్నర్ల 51వ సమావేశం దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ భేటీకి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ నేతృత్వం వహించారు.

51st Conference of Governors
రాష్ట్రపతితో గవర్నర్ల 51వ సమావేశం
author img

By

Published : Nov 11, 2021, 10:53 AM IST

Updated : Nov 11, 2021, 12:30 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్​ గవర్నర్ల 51వ సమావేశం.. రాష్ట్రపతి భవన్​లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా సహా పలు రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు.

51st Conference of Governors
సమావేశానికి హాజరైన మోదీ, వెంకయ్యనాయుడు

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ అధ్యక్షతన జరిగిన నాలుగో సమావేశం ఇది.

కరోనా వారియర్స్​పై ప్రశంసలు..

కొవిడ్​-19 మహమ్మారి వేళ కరోనా యోధులు అంకితభావంతో పని చేశారని కొనియాడారు కోవింద్​. పరిమిత వనరులు ఉన్నప్పటికీ కరోనాపై భారత్​ గొప్ప పోరాటం సాగించిందని తెలిపారు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు అండాగా నిలిచిందని గుర్తు చేశారు.

51st Conference of Governors
మాట్లాడుతున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

" రెండేళ్ల విరామం తర్వాత ఈ రోజు సమావేశమయ్యాం. కొవిడ్​-19 మహమ్మారిపై మన కరోనా యోధులు అంకితభావంతో పోరాటం చేశారు. నేటికి 108 కోట్ల డోసుల కొవిడ్​ టీకాల పంపిణీ జరిగింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ వేగంగా కొనసాగుతోంది."

- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

1949 నుంచి ఏటా గవర్నర్ల సదస్సు జరుగుతోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా గతేడాది జరగాల్సిన భేటీ రద్దయింది.

ఇదీ చూడండి: అఫ్గాన్​పై 'దిల్లీ డిక్లరేషన్​'- ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని పిలుపు

Last Updated : Nov 11, 2021, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.