ETV Bharat / bharat

లాక్​డౌన్​ భయాలు.. సొంతూళ్లకు కూలీలు - వలస కూలీల్లో ఆందోళన

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో వలస కూలీల్లో ఆందోళన పెరుగుతోంది. మరోసారి పూర్తి స్థాయి లాక్​డౌన్​ విధిస్తారేమోనన్న భయాలు వారిలో పెరిగిపోతున్నాయి. దాంతో.. తమ స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. మూడురోజులుగా రైల్వే స్టేషన్లన్నీ వలస కూలీలతోనే కిటకిటలాడుతున్నాయి. మరోవైపు.. బస్సుల్లో వెళ్లేందుకు మహారాష్ట్ర ఠాణెలోని మాజివడా బస్టాండ్​కు జనం భారీగా చేరుకుంటున్నారు.

migrant workers
లాక్​డౌన్​ భయాలు.. సొంతూళ్లకు కూలీలు
author img

By

Published : Apr 9, 2021, 9:33 AM IST

లాక్​డౌన్​ భయాలు.. సొంతూళ్లకు కూలీలు

కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరడం వల్ల నగరాల్లోని వలస కూలీల్లో దడ పెరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జనజీవనంపై ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ పరిస్థితులు చూసి మరోసారి పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధిస్తారన్న భయాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబయిలోని కూలీలు పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. గత మూడు రోజుల్లోనే 4.55 లక్షల మందికి పైగా సొంతూళ్లకు పయనమయ్యారు. అన్ని రైల్వే టెర్మినల్స్​ వీరితోనే కిటకిటలాడుతున్నాయి. ముంబయి నుంచి బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​ వెళ్లే రైళ్ల బెర్తులన్నీ నిండిపోయాయి.

migrant workers
రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న వలస కూలీలు
migrant workers
రైళ్లలో సీట్ల కోసం వలస కార్మికుల అవస్థలు
migrant workers
స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్​లో నిరీక్షిస్తున్న వలస కార్మికులు

బస్సుల కోసం..

మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం.. మినీ లాక్​డౌన్​ విధించింది. దాంతో నిత్యావసరాలు మినహా అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో హోటళ్లు, బార్లు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు గతేడాది లాగే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​కు చెందిన కార్మికులు ఠాణెలోని మాజివడా బస్టాండ్​కు భారీగా చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయా రాష్ట్రాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. దాంతో.. బస్సుల కోసం వందలాది మంది కార్మికులు నిరీక్షిస్తున్నారు.

పుణె నుంచి కూడా..

పుణె నుంచి కూడా పెద్దఎత్తున కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి బిహార్​, దిల్లీ వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు కరోనా కట్టడికి ఉత్తర్​ప్రదేశ్​లో రాత్రి కర్ఫ్యూ విధించారు. మధ్యప్రదేశ్​లో వారాంతపు లాక్​డౌన్​ ప్రకటించారు. తమిళనాడులోనూ ఆంక్షలు కఠినతరం చేశారు.

migrant workers
రైల్వే స్టేషన్లలో వలస కూలీలు
migrant workers
రైళ్ల బెర్తుల్లో కిక్కిరిసిపోయిన వలస కూలీలు

ఇదీ చూడండి: 'మాస్కులు ధరించని అభ్యర్థులపై నిషేధం విధించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.