ETV Bharat / bharat

ఉగ్రవాది పట్టివేత.. చైనీస్​ తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం - జమ్ములో ఉగ్రవాది పట్టివేత

Terrorist arrested in JK: జమ్ముకశ్మీర్​ దోడలో ఫరీద్​ అహ్మద్​ అనే ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ చైనీస్​ తుపాకీ​ సహా రెండు మ్యాగజైన్స్​, 14 బుల్లెట్లు, మొబైల్​ ఫోన్​ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Terrorist arrested in JK
ఉగ్రవాది ఫరీద్​ అహ్మద్​
author img

By

Published : Jun 27, 2022, 11:17 AM IST

Updated : Jun 27, 2022, 11:50 AM IST

Terrorist arrested in JK: జమ్ముకశ్మీర్​ దోడలో ఆదివారం ఓ ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఓ చైనీస్​ తుపాకీ​ సహా రెండు మ్యాగజైన్స్​, 14 బుల్లెట్లు, మొబైల్​ ఫోన్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమర్​నాథ్ యాత్ర నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే దోడ పట్టణంలో ఆదివారం రాత్రి తనిఖీ చేస్తుండగా ఆయుధాలతో సహా ఉగ్రవాది పట్టపడ్డాడు.

Terrorist arrested in JK
ఉగ్రవాది ఫరీద్​ అహ్మద్​

ఉగ్రవాదిని దోడలోని కోట గ్రామానికి చెందిన ఫరీద్​ అహ్మద్​గా గుర్తించారు. ఇతడు చాలా ప్రమాదకర వ్యక్తని.. ఉగ్రవాద కమాండర్ల నుంచి కాల్స్​ వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెప్పారు. మార్చిలో ఇతడి వద్దకు ఆయుధాలు వచ్చాయని.. వాటితో దోడ పోలీసులపై దాడి చేయాలని ఉగ్రవాదులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. సకాలంలో స్పందించడం వల్ల ఈ కుట్ర విఫలమైందని పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.

Terrorist arrested in JK
స్వాధీనం చేసుకున్న పిస్టల్​ , బుల్లెట్లు

అక్రమ చొరబాటుదారుడి హతం: భారత సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారుణ్ని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద హతం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బక్రాపుర్​ బార్డర్​ ఔట్​పోస్ట్​ వద్ద ఉదయం 4గంటలకు ఓ వ్యక్తి భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రత బలగాలు గుర్తించి కాల్పులు జరిపాయి. ఈ దాడిలో చొరబాటుదారుడు అక్కడిక్కడే మరణించాడు అని తెలిపాయి.

ఇదీ చదవండి: అగ్నిపథ్​ నిరసనలు.. మరోవైపు దరఖాస్తుల వెల్లువ.. వాయుసేనకు 3 రోజుల్లోనే!

Last Updated : Jun 27, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.