Terrorists recce in Hyderabad: మహారాష్ట్రలోని నాందేడ్, తెలంగాణలోని హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు వీరు నాందేడ్‌లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి బీదర్ మీదుగా గోవాకు వెళ్లారని వెల్లడించాయి. వీరంతా ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్ హర్విందర్ సింగ్ రింధా అనుచరులు అని పోలీసులు చెబుతున్నారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలను నాందేడ్‌కు తరలించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఉగ్రవాదులు నాందేడ్, హైదరాబాద్‌తో పాటు బీదర్, గోవాలోనూ తిరిగారని పోలీసులు తెలిపారు. అయితే, నాందేడ్పైనే వీరు స్పెషల్ ఫోకస్ పెట్టారని స్పష్టం చేశారు. దీన్ని బట్టి వీరంతా హర్విందర్ సింగ్ రింధా అనుచరులేనని పోలీసులు స్పష్టతకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో నాందేడ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. రింధాకు సంబంధించిన స్థలాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అతడి అనుచరులపై నిఘా పెట్టారు. ఇదివరకు అరెస్టు అయి బెయిల్‌పై విడుదలైన అతడి అనుచరుల వివరాలు సేకరిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అనేక ప్రదేశాల్లో ఆయుధాలు లభించినట్లు సమాచారం. అయితే, నాందేడ్‌లో పేలుడు పదార్థాలు అమర్చాలన్నది ఉగ్రవాదుల ప్రణాళిక కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని నాందేడ్ డివిజన్ ఐజీ నిసార్ తంబోలీ పేర్కొన్నారు. నాందేడ్ పోలీసులు, హరియాణా పోలీసులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Nagpur railway station bomb: మరోవైపు, మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పేలుడు పదార్థాలు కనిపించడం కలకలం రేపింది. నాగ్‌పుర్ రైల్వే స్టేషన్లో ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. బ్యాగులో 54 డిటోనేటర్లు, స్వల్ప తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు లభించాయని నాగ్‌పుర్ పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: