జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భఘాట్ బార్జుల్లా ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై బహిరంగంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది.. అతి సమీపం నుంచి పోలీసులపై కాల్పులు జరిపాడు. వీరి కాల్పుల్లో సోహైల్, మహమ్ముద్ యూసఫ్ అనే కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.
కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయ రోడ్డులో ఘటన జరగడం కలకలం రేపింది. ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్న భద్రతా దళాలు, దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.